ఖమ్మంలో ఎ.సి.బి. వర్సెస్ రెవెన్యూ
Publish Date:Apr 28, 2012
Advertisement
ఎసిబి అధిఆరులు మద్యం టెండర్ల అవకతవకలపై ఖమ్మంజిల్లాలో పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారిని అరెస్టు చేయటంతో జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం టెన్షన్ కు గురవుతోంది. ఎసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించి అప్పటి అదనపు జాయిట కలెక్టర్ సుభాష్ చంద్రబోస్ తో పాటు కొత్తగూడెంకు చెందిన ఒక రెవెన్యూ అధికారిని కూడా అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. ఎసిబి అధికారులు తమను టార్గెట్ చేయటం పట్ల రెవెన్యూ అధికారులు గుర్రుగా ఉన్నారు. గతంలో ఎసిబి అధికారులు ఎక్కడైనా అవకతవకలకు పాల్పడ్డారా? అవినీతి చర్యలకు పాల్పడ్డారా? అన్న విషయంపై దృష్టి సారించారు. నిజానికి ఎసిబి అధికారులు గతంలో అవినీతి అధికారులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని వారిపై కేసులు పెట్టకుండా వదిలివేశారని కొందరు రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలకోసం వారు వెదుకుతున్నారు. ఎసిబి అధికారులను ఇరుకున పెట్టే విషయమై వారు ఈ చర్యలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇవేమీ పట్టించుకోని ఎసిబి అధికారులు మద్యంషాపుల టెండర్లలో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా వెళ్ళి విచారణ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/acb-v/s-revenue-in-khammam-district-24-13691.html





