రేప్ కేసులో ఐపీఎల్ స్టార్ ఆటగాడు అరెస్ట్..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

అత్యాచార ఆరోపణలపై యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన కఠిన ఆదేశాల అనంతరం, అత్యాచారం  క్రిమినల్ బెదిరింపుల తీవ్ర ఆరోపణల కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసు యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ రంగంలో ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న ఒక యువ ఆటగాడు సడన్‌గా ఇటువంటి వివాదంలో చిక్కుకోవడం క్రీడాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, ఒక వైద్య విద్యార్థిని (మెడికల్ స్టూడెంట్) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పశ్చిమ బెంగాల్‌లోని మోగ్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం, గత 3 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి అభిషేక్ పోరెల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. 

అయితే గత ఏడాది కాలంగా తనను క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించాడని, పెళ్లి విషయం ప్రస్తావించగా స్పష్టంగా నిరాకరించాడని పేర్కొంది. అంతేకాకుండా తనపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, తీవ్రస్థాయిలో క్రిమినల్ బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించింది.పరిస్థితి ఇంతటితో ఆగక, వారిద్దరికి సంబంధించిన వ్యక్తిగత మరియు సన్నిహిత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నాన్-బెయిలబుల్ తీవ్రమైన సెక్షన్ల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

ఈ అంశంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. న్యాయస్థానం బాధితురాలి గోప్యతను, భద్రతను కాపాడటానికి ప్రత్యేక చర్యలు సూచించింది. అందులో భాగంగా అభిషేక్ పోరెల్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను (మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు మొదలైనవి) తక్షణమే స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. పోరెల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఒకవైపు ఐపీఎల్, బెంగాల్ ప్రో T20 లీగ్ వంటి వేదికలపై పరుగుల వర్షం కురిపిస్తూ లైమ్‌లైట్‌లో ఉన్న క్రీడాకారుడు, ఇలా చట్టపరమైన కేసులో కటకటాల పాలవ్వడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

Abhishek Porel, Abhishek Porel Arrest, Delhi Capitals Cricketer, Calcutta High Court, BNS Case Mogra PS, IPL Cricketer Rape Case

By
en-us Political News

  
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.