హైదరాబాద్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ.. అమెరికా కనిపెట్టింది..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ తనకేమీ కాదన్నట్టుగా వ్యవహరించాడు. కానీ.. డిజిటల్ ప్రపంచంలో వేసిన ప్రతి అడుగు ఓ ఆనవాలే. చివరకు అతడి ఆన్‌లైన్ కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయి నిఘా సంస్థ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు చిక్కాడు.

అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) అందించిన సమాచారంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గాజులరామారం ప్రాంతానికి చెందిన శానప్ప అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారులకు సంబంధించిన అక్రమ లైంగిక కంటెంట్‌ను వీక్షించడంతో పాటు, వాటికి సంబంధించిన లింకులను ఇతరులకు షేర్ చేస్తున్నట్లు NCMEC గుర్తించింది. నిందితుడి ఆన్‌లైన్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని NCMEC తన టిప్‌లైన్ ద్వారా భారతీయ అధికారులకు చేరవేసింది. 

దీంతో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆన్‌లైన్ కార్యకలాపాలను విశ్లేషించిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా అతడు వినియోగిస్తున్న ఫోన్ నంబర్‌ను గుర్తించినట్లు తెలిసింది. ఆ వివరాలను జీడిమెట్ల పోలీసులకు అందించడంతో పోలీసులు శానప్పపై కేసు నమోదు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు ఎవరెవరికి లింకులు షేర్ చేశాడు..? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా..? అనే కోణాల్లోనూ విచారణ సాగుతున్నది. సోషల్ మీడియాలో తమ కార్యకలాపాలు ఎవరికీ తెలియవని భావించే వారికి.. ఈ ఘటన డిజిటల్ నిఘా ఎంత పకడ్బందీగా ఉందో చెప్పకనే చెబుతోంది.

Child pornography in Hyderabad, NCMEC, Telangana Cyber ​​Crime, Gajularamaram, Social media, Jeedimetla Police

By
en-us Political News

  
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.