జగన్ డిజిటల్ బుక్.. తొలి ఫిర్యాదు మాజీ మంత్రి విడదల రజినిపైనే

Publish Date:Sep 29, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆర్భాటంగా డిజిటల్ బుక్ యాప్ ను ప్రారంభించారు. ఈ బుక్ లో వైసీపీ కార్యకర్తలు తమను వేధించిన వారిపై ఫిర్యాదులు నమోదు చేస్తే.. తాను అధికారంలోకి వచ్చాకా, వారి సంగతి తెలుస్తానని అన్నారు. చాలా మంది ఈ డిజిటల్ బుక్ ను గత ఎన్నికల సమయంలో లోకేష్ చెప్పిన రెడ్ బుక్ కు మక్కీకి మక్కీ కాపీ అన్న విమర్శలు వెల్లువెత్తాయి. అది పక్కన పెడితే జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ బమూరాంగైందన్న సెటైర్లు సొంత పార్టీ వారి నుంచే వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలపై వేధింపులు పరాకాష్టకు చేరాయి. ఇప్పుడు వేధింపులపై ఫిర్యాదులు నమోదు చేయండి అంటూ.. జగన్ డిజిటల్ బుక్ ను ఇలా ప్రారంభించారో లేదో.. అలా  ఆ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు నమోదైంది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఎవరిపైనో తెలుసా? వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినిపై. ఔను డిజిటల్ బుక్ లో నమోదైన తొలి ఫిర్యాదు విడదల రజినీ పైనే.. 

జగన్ హయాంలో విడదల రజినిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు ఇలా లెక్కలేనన్ని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో తొలి ఫిర్యాదు విడదల రజినీపైనే రావడంతో జగన్ డిజిటల్ బుక్ సొంత పార్టీ వారిపై వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకుంటుదా అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతున్నది. ఇంతకీ రజినిపై ఫిర్యాదు ఏమిటంటే.. 

చిలుకలూరిపేటలో ఎన్నో అరాచకాలు చేసిన విడుదల రజనీ టీడీపీ వారినే కాదు.. సొంత పార్టీకి అండగా ఉండే వారిని కూడా టార్గెట్ చేశారు. నవతరం  అనే పార్టీకి స్వయం ప్రకటిత అధ్యక్షుడైన   రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. 2022లో  రజినీ మంత్రిగా ఉన్న సమయంలో  తన కార్యాలయం, నివాసంపై దాడులు చేయించారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. ఈ దాడికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన  ఆ ఫిర్యాదుకు జోడించారు.  విడదల రజినిపై చర్యలు తీసుకుంటేనే వైసీపీ కార్యకర్తలు జగన్ ను నమ్మతతారనీ, లేకపోతే కార్యకర్తలలో జగన్ విశ్వాసాన్ని కోల్పోతారని ఆ సుబ్రహ్మణ్యం అంటున్నారు. 

వాస్తవానికి చిలుకలూరిపేట  ఎమ్మెల్యేగా విడదల రజిని ఉన్న సమయంలోనూ, అలాగే ఆ తరువాత జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలోనూ  రజినిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. అంతెందుకు ఆమె మరిదిని పోలీసలు అరెస్టు చేశారు కూడా.  అధికారంలో ఉన్నప్పుడు ఆమె సొంత పార్టీ వారిపై కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో రజినిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడంతో.. ముందు ముందు వైసీపీ నేతలపైన డిజిటల్ బుక్ లో మరెన్ని ఫిర్యాదులు నమోదౌతాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ నుంచి సైతం ఆమెపై ఫిర్యాదులు తప్పడం లేదు. ఆమె చేసిన దందాల కారణంగా పేటలో అయితే గెలలేరని గుంటూరుకు పంపించారు. అక్కడ అసలు ఘోరంగా ఓడిపోవడంతో..తనకు పేటనే మంచిదని చెప్పి మళ్లీ అక్కడికే ఇంచార్జ్ గా వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు.

By
en-us Political News

  
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.