ఒకే రోజు 105 శంకుస్థాపనలు
Publish Date:Mar 9, 2025
Advertisement
చరిత్ర సృష్టించనున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఆ పేరు చెప్తేనే వైసీపీ నేతలు ఉలిక్కిపడతారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అసమ్మతి బావుట ఎగురవేసి, అప్పుడే వైసీపీ పతనానికి బీజం వేశారాయన. ఎన్నికలకు ముందు వరకూ వైసీపీపై ఓ రేంజ్ లో విమర్శలు వినిపించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధే ఎజెండాగా పెట్టుకుని తన అసెంబ్లీ సెగ్మెంట్లో తన పని తాను సైలెంట్‌గా చేసుకుని పోతున్నారు. నియోజకవర్గంల్లో కార్యకర్తలను ఆప్యాయంగా పలంకరించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కావాల్సిన చర్యలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆయన దేశంలోనే రికార్డు సృష్టించబోతున్నారు. దేశ చరిత్రలో ఎపుడు జరగని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోమవారం (మార్చి 10) ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారు. మరో వారం రోజుల్లో ఇంకో 198 అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. మొత్తం 303 అభివృద్ధి పనుల్ని 60 రోజుల్లో పనులు పూర్తి చేసి, మే 20న ప్రజలకు అంకితం చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 303 పనులకు గాను రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో రూ. 191 కోట్ల అభివృద్ధి పనులు జరగడం విశేషం. ప్రస్తుతం రికార్డు స్థాయిలో చేపట్టనున్న 105 పనులను ఎక్కడికక్కడ ప్రజలే ప్రారంభించనున్నారు. కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే నాయకుడు బాగుంటాడు అని నమ్మే వ్యక్తి అయిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, అభివృద్ది పనుల్లో కార్యకర్తలను భాగస్వాముల్ని చేస్తున్నారు. శంకుస్థాపన చేయనున్న వాటిలో 303 పనులను పార్టీ జెండా మోసిన 606 మంది కార్యకర్తలకు కట్టబెట్టి లీడర్‌గా తన నిబద్ధత చాటుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/105-foundation-stones-on-one-day-25-194117.html





