ఈటల రాజేందర్ మళ్లీ హర్టయ్యారు!.. ఈ సారి బీజేపీతో తాడో పేడో?

Publish Date:Dec 13, 2025

Advertisement

ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా... ఆ పార్టీలో ఆయన ఒంటరే అని చెప్పాలి. అసలు ఈటల బీజేపీలో చేరడమే ఆశ్చర్యమంటారు ఆయన గురించి తెలిసిన వారు. సరే రాజకీయ అనివార్యతతో ఆయన బీజేపీ పంచన చేరినా పదే పదే అవమానాలకు గురైతున్నారు. ఉక్కపోతను తట్టుకుంటూ నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ సాధన ఉద్యమం నుంచి, రాష్ట్ర ఆవిర్భావం వరకూ, ఆ తరువాత ఐదేళ్ల పాటు మంత్రిగా ఈటల తెలంగాణ ప్రగతిలో కేసీఆర్ తో సమానమైన స్థాయిలో పని చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఈ విషయం వాస్తవం.  2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తరువాత   తెలంగాణ ప్రగతిలో, సంక్షేమంలో ఈటల ముద్ర చెరిపివేయడం సాధ్యం కాదనీ బీఆర్ఎస్ వర్గాలే చెబుతాయి.

 రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటల బడ్జెట్ కేటాయింపులు హేతుబద్ధంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేవని బీఆర్ఎస్ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా అప్పట్లో ప్రశంసలు కురిపించారు. వామపక్ష భావజాలంతో ఉ:డే ఈటల.. తన శాఖకు సంబంధించినంత వరకూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారనీ, అదే కేసీఆర్ కు నచ్చలేదనీ అనే వారు బీఆర్ఎస్ లో ఇప్పటికీ ఉన్నారు.  సరే 2014 ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపిన క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోనే పడినా.. తెలంగాణ ప్రగతిలో కొంత క్రెడిట్ ఈటల ఖాతాలోనూ పడింది. అదే ఆయనకు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కారణమైందని అంటారు.  2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజ

యం సాధించి కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత ఈటలను ఆయన దూరం పెట్టారు.   కేబినెట్ లో ఇవ్వలేదు. అయితే . ఆ తరువాత విస్తరణ సమయంలో అనివార్యంలో ఈటలను కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ,  భూ కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు .దీంతో పొమ్మన లేక పొగబెడుతున్నారని గ్రహించిన ఈటల ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు.  వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీ గూటికి చేరడమేమిటన్న విస్మయం అప్పట్లో సర్వత్రా వ్యక్తమైంది.  ఇది జరిగిన కొన్నాళ్లకే ఈటల తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు.  అధికార బీఆర్ఎస్ ఎన్ని విధాలుగా ఈటల విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం సాధించలేకపోయి చతికిల పడింది. నియోజకవర్గంలో  బీసీలలో తనకున్న పట్టును ఈటల హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో  23, 855 ఓట్ల మెజారిటీతో  గెలవడం ద్వారా నిరూపించుకున్నారు.

బీజేపీ అభ్యర్థిగా ఆ ఉప ఎన్నికలో విజయం సాధించినా.. ఈ గెలుపు మాత్రం పూర్తిగా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. అయితే తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.   పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో   బండి సంజయ్ అనుచరులు ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులుగా బరిలో నిలబడ్డారు.  సరే ఈటల రాజేందర్ వర్గీయులు కూడా   బీజేపీ మద్దతుదారులుగా పోటీలో నిలిచారు. అయితే  సర్పంచులుగా గెలిచిన వారు బండి సంజయ్ మద్దతుదారులే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియా వేదికగా  ఈటల వర్గీయుల ఓటమిని ప్రస్తావిస్తూ, వారెవరికీ బీజేపీ మద్దతు ఇవ్వలేదు, ఈటల స్వయంగా వారిని నిలబెట్టారన్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. శనివారం (డిసెంబర్ 12) మీడియాతో మాట్లాడిన ఆయన   ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో, ఉండాలో ప్రజలే తేల్చుకుంటారనీ, కాలమే అన్నీ నిర్ణయిస్తుందని అన్నారు.  పంచాయతీ ఎన్నికలలో మిగిలిన రెండు విడతలూ పూర్తయిన తరువాత అన్ని విషయాలూ వివరంగా చెబుతానన్న ఈటల ఈ సారి పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికే రెడీ అయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు.  

By
en-us Political News

  
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.