తెలివైన వ్యక్తి చేసే ఈ తప్పులు.. జీవితాన్ని కల్లోలం చేస్తాయి..!
Publish Date:Nov 22, 2025
Advertisement
అబద్దం .. అబద్దం ఆడితే తప్పేమీ లేదని చాలా మంది అంటూ ఉంటారు. అవసరానికి అబద్దం చెప్పడం అసలు తప్పే కాదని కూడా అంటారు. కానీ అబద్ధం చెప్పే అలవాటు సమస్యలకు దారితీస్తుంది. అబద్ధం చెప్పడం సమస్యలను పెంచడమే కాకుండా వ్యక్తి ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. చర్య.. ఆలోచన.. తెలివైన వ్యక్తి తను చెసే ప్రతి పనినీ, ఆ పని చేసేటప్పుడు తన ఆలోచనను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒక పక్షి తన రెండు రెక్కలు ఉపయోగిస్తెనే బాగా ఎగరగలదు. అలాగే తెలివైన వ్యక్తి చర్య, ఆలోచన జ్ఞానం రెండు బాగా ఉంటేనే తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. కాబట్టి చర్యలను, జ్ఞానాన్ని సరైన దిశలో ఉంచుకోవాలి . గౌరవం.. నిరాకరించిన చోట, జీవనోపాధి అందుబాటులో లేని చోట, నేర్చుకోవడానికి అవకాశం లేని చోట అస్సలు ఉండకూడదు. ఇలాంటి చోట ఎదుగుదల, జ్ఞానార్జన, సరైన ఆదాయం ఉండదు. నిజాయితీ.. సంతోషకరమైన, విజయవంతమైన జీవితం కావాలంటే ఎప్పుడూ నిజం మాట్లాడాలి . తెలివిగా ఖర్చు చేయాలి. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఇలా చేసే వ్యక్తులు సంతోషంగా ఉండటమే కాకుండా, తెలివైనవారిగా పరిగణించబడతారు. స్నేహం.. జాగ్రత్త.. శక్తివంతమైన శత్రువు, బలహీనమైన స్నేహితుడు ఇద్దరూ ఇబ్బందులకు గురిచేస్తారు. అందుకే స్నేహితుల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఆకలి, తెలివితేటల మధ్య సంబంధం.. తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. ఎందుకంటే ఆకలితో ఉండటం తెలివితేటలను బలహీనపరుస్తుంది. ఇది వ్యక్తి ఆలోచన విచక్షణను అణిచివెస్తుంది. ఆకలితో ఉండటం కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది.
వ్యక్తి ఆలోచన, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు.. ఇలా వీటన్నిటి ఆధారంగా వ్యక్తి మంచివాడు అని, చెడ్డవాడు అని.. తెలివైన వాడని, తెలివి లేని వాడని చెబుతారు. అయితే.. తెలివైన వ్యక్తి జీవితాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటాడు. అందుకే అతని జీవితం ఇతరులతో పోలిస్తే మెరుగ్గా అనిపిస్తుంది. కానీ తెలివైన వ్యక్తి తన జీవితంలో చేసే తప్పులు అతని జీవితాన్ని కల్లోల్లం చేస్తాయి. ఎంతో బాగుంది అనుకునే జీవితాన్ని గందరగోళంలో నెట్టి వేస్తాయ్. ఇంతకీ తెలివైన వ్యక్తులు చేయకూడని ఆ తప్పులు ఏమిటి? తెలుసుకుంటే..
*రూపశ్రీ
http://www.teluguone.com/news/content/-mistakes-you-make-that-create-chaos-35-206849.html





