Publish Date:Oct 17, 2025
ఎంత డబ్బున్నా ఇంకా ఇంకా కావాలని అనుకునే వారు కోకొల్లలు. నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి ఆలోచించకుండా అప్పనంగా వచ్చే సొత్తుకోసం ఆశపడేవారి సంఖ్య అనంతం. అటువంటి సమాజాంలో ఒక నిరుపేద మహిళ చూపిన నిజాయితీ అందర్నీ ఫిదా చేస్తున్నది. తాను స్వయంగా పుట్టెడు కష్టాలలో ఉన్నా.. నిజాయితీని వీడలేదు. ఆ మహిళ పేరు స్మిజామోహన్. కేరళలో లాటరీ టికెట్లు అమ్మి పొట్టపోషించుకుంటోంది.
ఆమె తన వద్ద అమ్ముడుపోని లాటరీ టికెట్లు కొన్ని ఉన్నాయనీ, వాటిని కొనుగోలు కొనమనీ తన రెగ్యులర్ కస్టమర్లను కోరింది. వారిలో చంద్రన్ అనే క్లయింట్ ఒక టికెట్ కొనేందుకు అంగీకరించాడు. ఫోన్ లోనే అతడు టికెట్ కొనడానికి అంగీకారం తెలిపి.. తనకు నచ్చిన ఒక లాటరీ టికెట్ ను ఎంచుకున్నాడు. ఆ కొనుగోలు కూడా అరువుమీదే చేశాడు. అంటే తరువాత డబ్బులు ఇస్తానన్నాడు. ఇదంతా మౌఖిక లావాదేవీయే. తాను ఎంచుకుని కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు అతడు ఇంకా డబ్బు కూడా చెల్లించలేదు.
సరే అతడు కొన్న టికెట్ కు ఆరు కోట్ల రూపాయల భారీ బంపర్ బహుమతి గెలుచుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే స్మజా మోహన్.. క్షణం ఆలస్యం చే యకుండా ఆ టికెట్ కొనుగోలు చేసిన చంద్రన్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపి.. అదే రోజు అతడి ఇంటికి వెళ్లి అతడు అరువుపై మాట మాత్రంగా కొన్న లాటరీ టికెట్ ను అతడికి అందజేసింది. ఈ విషయం తెలియగానే స్మిజా మోహన్ నిజాయితీని ప్రశంసిస్తూ ఆమెకు అసంఖ్యాకంగా ఫోన్ లు వచ్చాయి. దీనిపై స్పందించిన స్మిజా.. నిజాయితీయే అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. కస్టమర్లు లాటరీ టికెట్ కొనడానికి వెచ్చించే సొమ్మతోనే తాను జీవిస్తున్నానని పేర్కొంది.
ఇంత తృణప్రాయంగా కోట్ల రూపాయలను కాదనుకుని నిజాయితీ, చిత్తశుద్ధి ప్రదర్శించిన స్మిజా మోహన్ సంపన్నురాలు కాదు. నిజానికి నిరుపేద. ఆమెకు డబ్బులు చాలా చాలా అవసరం. ఆమె పెద్ద కుమారుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. చిన్నకుమారుడికి క్యాన్సర్. తన పిల్లల చికిత్సకు ఆమెకు డబ్బు ఎంతో అవసరం. అయినా తనది కాని సొమ్ము కోసం ఆమె ఇసుమంతైనా ఆశపడలేదు. ఆమె నిజాయితీకి అంతా ఫిదా అవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-kerala-woman-deserves-to-be-praised-for-her-honesty-36-208079.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.