చాణక్యుడు చెప్పిన మాట.. దయచేసి ఇలాంటి పరిస్థితులలో మాత్రం మౌనంగా ఉండండి.. 

Publish Date:Oct 8, 2026

Advertisement

చాణక్యుడు చెప్పిన మాట.. దయచేసి ఇలాంటి పరిస్థితులలో మాత్రం మౌనంగా ఉండండి.. 

మానవ జీవితంలో మాట అనేది ఎంత శక్తివంతమైనదో, మౌనం కూడా అంతే ప్రయోజనకరమైనది. ఎన్నో  సందర్భాల్లో మనం మాట్లాడే మాటల కంటే మౌనంగా ఉండటమే మనకు గొప్ప గౌరవాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. నోటి నుంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోలేము. కొన్నిసార్లు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా, సమయం , సందర్భం సరిగ్గా లేకపోతే అది తీవ్రమైన గొడవలకు, మనస్పర్థలకు దారితీస్తుంది. అందుకే  గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మాటల వల్ల జరిగే సంఘటనల గురించి, మౌనం  గొప్పతనం గురించి వివరంగా చెప్పారు. జీవితంలో ప్రశాంతంగా, విజయవంతంగా ఉండటానికి ఎలాంటి పరిస్థితులలో మౌనంగా ఉండాలో చాణక్యుడు స్పష్టంగా మార్గదర్శనం చేశారు. ఆ ముఖ్యమైన ఆరు సందర్భాల గురించి  వివరంగా తెలుసుకుంటే..

ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు..

ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్న  సమయంలో పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మధ్యలో దూరి అభిప్రాయం చెప్పడం చాలా ప్రమాదకరం. సమస్యను పరిష్కరించాలనే మంచి ఉద్దేశం  ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నవారు మీ మాటలను వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ మాటలు ఒకరికే అనుకూలంగా ఉన్నాయని భావించి, మిమ్మల్ని కూడా ఆ వివాదంలోకి లాగుతారు. కాబట్టి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు వాతావరణం ప్రశాంతంగా మారే వరకు వేచి చూడటం, మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది.

ఎదుటి వ్యక్తి  సలహాను స్వీకరించడానికి  ఇష్టపడనప్పుడు..

ఒక మనిషికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉందంటే, ఆ వ్యక్తి దానిని వినడానికి, అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసి, మీ మాటలను అస్సలు పట్టించుకోవడానికి ఇష్టపడనప్పుడు, వారికి పదే పదే  చెప్పాలని చూడటం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా అది అనవసరమైన వాదనలకు దారితీస్తుంది. అటువంటి సమయంలో మీ అభిప్రాయాలను వారిపై రుద్దకుండా మౌనంగా వెనక్కి తగ్గడమే వివేకవంతమైన పని.

మీ మాటలకు లేదా అభిప్రాయాలకు  గౌరవం లభించని చోట..

మీరు ఎంత మంచి విషయాలు చెప్పినా ఎదుటివారు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటున్నా, లేదా మీ మాటలను పదే పదే  తోసిపుచ్చుతూ హేళన చేస్తున్నా అక్కడ పదే పదే మాట్లాడటం సరికాదు. ప్రతిసారి మిమ్మల్ని మీరు సరైనవారని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మాటలను  అక్కడితో ముగించి మౌనంగా ఉండటం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి వాదనలోనూ గెలవడం కంటే మన ప్రశాంతతను, గౌరవాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం.

పూర్తి సమాచారం లేదా స్పష్టత లేనప్పుడు..

సగం సగం తెలిసిన విషయాలతో లేదా కేవలం అంచనాలతో సలహాలు ఇవ్వడం చాలా నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా తీవ్రమైన లేదా సున్నితమైన విషయాలలో అవగాహన లేకుండా మాట్లాడితే ఇతరులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఒక విషయం గురించి సరిగ్గా తెలియనప్పుడు, దాని గురించి ముందుగా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నాకు ఈ విషయం పూర్తిగా తెలియదు అని అంగీకరించి మౌనంగా ఉండటమే నిజమైన తెలివితేటలకు నిదర్శనం.

ఇతరుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివాదాల్లో..

ఇతరుల కుటుంబ విషయాలలో బయటి వ్యక్తులకు పూర్తి వివరాలు లేదా వారి మధ్య ఉండే పాత బంధాలు, భావోద్వేగాలు తెలియవు. అడిగి అడగకుండా అటువంటి విషయాల్లో సలహాలు ఇవ్వడం లేదా కల్పించుకోవడం అస్సలు మంచిది కాదు. కాలక్రమేణా కుటుంబ సభ్యులు తమ సమస్యలను తామే పరిష్కరించుకుని ఒకటవుతారు, కానీ ఆ సమయంలో మీరు అన్న మాటలు మాత్రం వారి మనస్సులో అలానే ఉండిపోతాయి. కాబట్టి ఇతరుల ఇంటి సంబంధిత గొడవల్లో మౌనంగా ఉండటమే మంచిది.

ఎదుటి వ్యక్తి తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు..

కోపంలో ఉన్న మనిషి సాధారణ స్థితిలో ఆలోచించలేడు. ఆ సమయంలో మనం చెప్పే మంచి మాటలు లేదా ఇచ్చే సరైన సలహాలు కూడా వారికి విమర్శలాగానో లేదా వ్యతిరేకతలాగానో కనిపిస్తాయి. దీనివల్ల కోపం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. అందుకే ఎదుటివారి కోపం చల్లారే వరకు ఓపికగా, మౌనంగా ఉండాలి. సరైన సమయం చూసి, ప్రశాంత వాతావరణంలో మాట్లాడితే వారు మీ మాటను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

పైన చెప్పుకున్న ఆరు పరిస్థితులలో చాణక్యుడు చెప్పినట్లుగా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల మన ప్రశాంతత దక్కడమే కాకుండా, అనవసరమైన చిక్కులు, గొడవలు, ఆత్మీయులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవచ్చు. సరైన సమయంలో మాట్లాడటం ఎంత ముఖ్యమో, సరైన సందర్భంలో మౌనంగా ఉండటం కూడా అంతే గొప్ప కళ.

                             *రూపశ్రీ.

 

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
సాయంత్రం పూట వేడి వేడిగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ కోసం సింపుల్ టిప్స్.
మధుమేహం మరియు ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఊరటనిస్తూ, మందులు లేకుండానే రక్తంలోని చక్కెరను నియంత్రించే సూక్ష్మ ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ గురించి తెలుసుకోండి. స్విస్ పరిశోధకుల ఈ సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీ విశేషాలు.
గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులలో ఆరోగ్యానికి ఏది మంచిది? బరువు నియంత్రణ, డయాబెటిస్, ఎముకల బలం కోసం ఏ రొట్టె ఉత్తమమో పూర్తి పోషక విశ్లేషణ తెలుసుకోండి.
మార్కెట్ నుంచి ఎండిన బిర్యానీ ఆకులు కొనడం ఆపేయండి! కేవలం రూ.200 పెట్టుబడితో మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పైనే గుమగుమలాడే బిర్యానీ ఆకు మొక్కను ఎలా సులభంగా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారపు అలవాట్లు, నీరు త్రాగే విధానం, వ్యాయామం మరియు నిద్రకు సంబంధించిన ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
నిద్రలేమి సమస్యను తగ్గించే పోషకాలు, పిప్పి పన్ను నొప్పికి తేనెతో ఇంటి చిట్కాలు మరియు 70% పచ్చి ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.