Publish Date:Mar 27, 2026
ప్రపంచంలో చమురు రవాణాకు సురక్షితమైన జల మార్గం ఏదీ లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హర్మూజ్ జలసంది మూసివేతతో బోస్ఫరస్ జలసంధి గుండా రష్యా చమురు రవాణా సురక్షితం అన్న భావనను పూర్వపక్షం చేస్తూ తాజాగా జరిగిన డ్రోన్ దాడి నల్ల సముద్రం గుండా చమురురవాణాపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా రష్యా నుంచి ముడి చమురుతో బయలు దేరిన నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కు అతి సమీపంలో. అదీ అత్యంత కీలకమైన బోస్ఫరస్ జలసంధి వద్ద జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
రష్యా నుంచి టర్కీకి ముడి చమురు రవాణా చేస్తున్న నౌకపై జరిగిన దాడిని టర్కీ థృవీకరించింది. ఈ దాడిలో నౌకలోని ఇంజిన్ దెబ్బతిని భారీ నష్టం వాటిల్లింది. ఈ దాడి జరిగిన బోస్ఫరస్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం కావడం గమనార్హం. రష్యా నుంచి చమురు ఎగుమతులకు ఇది అత్యంత కీలకం కూడా. ఇలాంటి ప్రాంతంలో డ్రోన్ దాడులు జరగడం వల్ల రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఈ దాడికి కారణం ఎవరు అన్నది వెంటనే తెలియరాలేదు. అలాగే ఈ దాడిలో ప్రాణనష్టం జరిగిందా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. ఈ దాడితో ఈ మార్గం గుండా వెళ్లే నౌకలను రష్ష్యా అప్రమత్తం చేసింది. అదనపు భద్రత లేకుండా ఈ మార్గం గుండా నౌకాయానానికి అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ దిశగా టర్కీ ఇప్పటికే చర్యలు చేపట్టింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-bosphorus-strait-is-not-safe-36-216247.html
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.