విశాఖ పరిణామాలపై చంద్రబాబు ఆరా.. పవన్ కు ఫోన్
Publish Date:Oct 17, 2022
Advertisement
విశాఖలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడం, ఆ హోటల్ లో బస చేసిన జనసేన నేతలను అరెస్టు చేయడం, పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం తదితర అశాలపై చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ కు పోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలకు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులను ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పవన్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. పవన్ కల్యాణ్ పర్యటనపై ఆంక్షలను వెంటనే తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో శనివారం వైకాపా నేతృత్వంలో జరిగిన విశాఖ గర్జన్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. కాగా అదే రోజు జనసేనాని పవన్ కల్యాణ విశాఖ రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విశాఖ విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ వచ్చిన సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొందరు మంత్రుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. జనసేన శ్రేణులు మంత్రులపై దాడులకు పాల్పడ్డారంటూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జనసేన నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆదివారం పోలీసులు పవన్ కు నోటీసులు ఇచ్చి విశాఖను వీడాలంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనీ, జగన్ సర్కార్ పోలీసు అండతో విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందనీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని పవన్ తో అన్నారు చంద్రబాబు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి పవన్ తో మాట్లాడారు. వందలాది మంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందన్న చంద్రబాబు, జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విశాఖలో పరిస్థితులపైని, తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతలను అరెస్టు చేయడం తదితర అంశాలను చంద్రబాబుకు వివరించారు.
http://www.teluguone.com/news/content/-babu-phone-to-pqwan-and-inquire-about-visakha-developements-39-145528.html





