గిడ్డి ఈశ్వరిని వెనకేసుకు వచ్చిన జగన్
posted on Dec 15, 2015 12:23PM
.jpg)
బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అసభ్యంగా మాట్లాడటమే కాకుండా ఆయన తల నరుకుతానని హెచ్చరించారు. ఆ సమస్యంలో ఆమె పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆమెను వారించకుండా ఆమె మాటలకు చాలా సంతోషిస్తున్నట్లుగా ముసిముసి నవ్వులు నవ్వారు. స్థానిక తెదేపా నేతల పిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేప్పట్టారు.
తన పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే వారించవలసిన జగన్, ఇప్పుడు ఆమెనే వెనకేసుకు రావడం విస్మయం కలిగిస్తోంది. గిరిజన జాతికి చెందిన ఆమె తనకు వచ్చిన బాషలో తన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆమెపై కేసులు పెట్టి పోలీసుల చేత ప్రభుత్వం వేధిస్తోందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు చాలా మంది తన పట్ల చాల సార్లు అటువంటి మాటలే మాట్లాడారని కానీ వంటిని తానెన్నడూ సీరియస్ గా తీసుకోలేదని, కానీ చంద్రబాబు నాయుడుని విమర్శించినందుకు ఈవిధంగా తన పార్టీ ఎమ్మెల్యేని వేధించడం సరికాదని జగన్ అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు పట్ల తన పార్టీ ఎమ్మెల్యే ఆవిధంగా మాట్లాడటాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్దిస్తున్నట్లే స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా వాదించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.