సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్!
on Dec 28, 2025

'తమిళగ వెట్రి కళగం'(TVK) పేరుతో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి(Vijay Thalapathy) ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆయన సినిమాలకు దూరమై, పూర్తిగా రాజకీయాలతో బిజీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' అవుతుందని..ఆయన అభిమానులు కూడా ఓ అంచనాకు వచ్చేశారు. తాజాగా ఇదే విషయాన్ని విజయ్ స్పష్టం చేశాడు. (Jana Nayagan)
తాజాగా కౌలాలంపూర్‌లో 'జన నాయగన్' ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్ మాట్లాడుతూ.. జన నాయగన్ తన ఆఖరి చిత్రమని ప్రకటించారు.
"ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చా. కానీ, అభిమానులు నాకు రాజ భవనం ఇచ్చారు. నా కోసం ఎంతోమంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం.. ఇప్పుడు నేను నిలబడతాను. ప్రజలకు సేవ చేసేందుకే సినిమాలు వదిలేస్తున్నా" అని విజయ్ అన్నారు. అభిమానుల కోరిక మేరకు స్టేజ్‌పై విజయ్ స్టెప్పులేయడం విశేషం.
కాగా, 'జన నాయగన్' సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది. ఇది బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమా ఆధారంగా రూపొందుతోందనే ప్రచారం ఉంది. అయితే దర్శకుడు హెచ్. వినోద్ మాత్రం ఇది రీమేక్ కాదని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



