గౌతం సవాంగ్ ఎందుకు శెలవులో వెళుతున్నారంటే...
posted on Dec 15, 2015 5:11PM
.jpg)
కాల్ మనీ వ్యవహారం నానాటికీ ముదురుతున్న సమయంలో విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ ఈ నెల 17 నుంచి 10 రోజులపాటు శలవులో వెళుతుండటం అధికార పార్టీకి ఊహించని సమస్యలను, ప్రతిఅప్క్ష పార్టీలకు బలమయిన ఆయుధాన్ని అందిస్తోంది. ఆయన క్రీస్టియన్ మతస్తుడు. ఆస్ట్రేలియాలో ఉన్న తన అల్లుడు,కుమార్తె వద్దకు వెళ్లి ఈసారి వారితో క్రిస్టమస్ పండుగ జరుపుకోవాలని నెలరోజుల ముందుగానే శలవుకి దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన శలవు మంజూరు అవడంతో ఆస్ట్రేలియాకి టికెట్లు కూడా కొనుకొన్నారు. కానీ ఊహించని విధంగా ఈ కాల్ మనీ వ్యవహారం బయట పడటం, దానిలో అధికార తెదేపా నేతల పేర్లు బయటపడుతుండటంతో, తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికి తెదేపా ప్రభుత్వమే ఆయనని శలవు మీద పంపుతోందని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ఆయనపై అధికార ప్రతిపక్షాల ఒత్తిడి ఎక్కువయిపోవడంతో ఆయన శలవు మీద వెలుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన ఆస్ట్రేలియా వెళ్ళడానికి చాలా రోజుల క్రితమే ఏర్పాట్లు చేసుకొన్నారని పోలీస్ అధికారులు చెపుతున్నారు. ఈ పది రోజుల కోసం ఆయన స్థానంలో సురేంద్రబాబు అనే మరో ఐపీఎస్ అధికారి తాత్కాలికంగా బాధ్యతలు తీసుకొంటున్నారు.