బంగాళదుంపలు,  ఉల్లిపాయలు.. కలిపి స్టోర్ చేస్తున్నారా? దిమ్మతిరిగే నిజాలివి..!


బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  దీంతో ఫ్రై చేసినా,  మసాలా కూర వండినా, చిప్స్ చేసినా లేదా వేరే స్నాక్స్ ఏమైనా చేసినా చాలా ఇష్టంగా తింటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే సాధారణ సంఘటన ఏంటంటే.. బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఒక బుట్టలో నిల్వ చేయడం. ఇలా బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేయడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? అనే విషయం చాలా మందికి తెలియదు.  కేవలం నిల్వ చేయడం గురించే కదా అనే అనుమానం చాలా మందికి రావచ్చు.  దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే..

బంగాళదుంపలు,  ఉల్లిపాయలు ఒకే బుట్టలో లేదా కంటైనర్ లో నిల్వ చేయడం గురించి చాలా షాకింగ్ నిజాలు వెలువడ్డాయి.  ముఖ్యంగా బంగాళదుంపలలో పెద్ద మొత్తంలో సెలీనిన్,  అల్లెన్ సల్పైడ్ లు ఉంటాయి.  ఇక ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఉల్లిపాయలను, బంగాళదుంపలను కలిపి ఉంచడం వల్ల రెండింటినలో ఉండే రసాయనాల చర్య వల్ల బంగాళదుంపలు మొలకెత్తుతాయి.

మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్, చాకోనిన్,   క్లోరోఫిల్ ఏర్పడతాయి. ఈ రసాయనాలు ఉన్న బంగాళదుంపలు తింటే అవి శరీరంలో విషాన్ని కలిగిస్తాయి.  ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా పిల్లలపై ఉంటుందట.

పై కారణంగా  ఉల్లిపాయలు, బంగాళదుంపలను ఒకే కంటైనర్ లో నిల్వ చేస్తే అది కాస్తా ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది.  అందుకే మార్కెట్ నుండి ఉల్లిపాయలు,  బంగాళదుంపలు తెచ్చినా.. వాటిని విడివిడిగా నిల్వచేయాలి.

                                   *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu