రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా?
posted on Sep 15, 2025 11:08AM
రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా?

ఆహారంలో ఉప్పు వేయడం తప్పనిసరి. ఉప్పు లేని వంట తినడం సాధ్యమే కాదు.. అయితే ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో రాతి ఉప్పును ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. ముఖ్యంగా సాధారణ ఉప్పును తినకూడని సమయంలో రాతి ఉప్పును ఎక్కువగా వాడతారు. కొందరు ఉపవాస సమయంలో ఉప్పు తినకూడదు అనే నియమం ఉన్నప్పుడు సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు ఆహారంలో వినియోగిస్తారు. కొందరు రాతి ఉప్పును రెగ్యులర్ గా వినియోగిస్తారు. రాతి ఉప్పుతో తయారు చేసిన ఆహారం జీర్ణక్రియకు మంచిదని చెబుతారు. కానీ రాతి ఉప్పు అందరికీ ప్రయోజనకరంగా ఉండదని చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా కొందరు ఈ రాతి ఉప్పును అస్సలు తినకపోవడం మంచిది. ఇంతకీ రాతి ఉప్పు ఎవరు తినకూడదు? తెలుసుకుంటే..
బిపి పేషెంట్లు..
రాతి ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు దీనిని తక్కువగా తీసుకోవాలి లేదా అస్సలు తీసుకోకపోవడం మంచిది.
గుండె జబ్బులు ఉన్నవారు..
సోడియం అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. రాతి ఉప్పు రక్తపోటు, శరీరంలో ద్రవాల నిలుపుదల పెంచడం ద్వారా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు.. లేదా కుటుంబంలో గుండె సంబంధం సమస్యల చరిత్ర ఉన్నవారు రాతి ఉప్పు దగ్గర జాగ్రత్తగా ఉండాలి.
కిడ్నీ రోగులు..
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరం నుండి అదనపు సోడియం తొలగించబడదు. ఇలా మూత్ర పిండాల సమస్య ఉన్నవారు రాతి ఉప్పు తింటే మూత్రపిండాల పరిస్థితిని మరింత దిగజారుతుంది.
షుగర్ పేషెంట్లు..
రాతి ఉప్పు ఎక్కువగా వినియోగించడం మధుమేహ రోగులకు హానికరం. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది.
థైరాయిడ్ రోగులు..
థైరాయిడ్ రోగులకు అయోడిన్ అవసరం. అయితే రాతి ఉప్పులో అయోడిన్ ఉండదు. దీని కారణంగా, థైరాయిడ్ అసమతుల్యత పెరుగుతుంది.
గర్భిణీ స్త్రీలు..
గర్భధారణ సమయంలో మహిళలు సోడియం, అయోడిన్ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. రాతి ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
వృద్ధులు..
వృద్ధులకు తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండె సంబంధిత సమస్యలు ఉంటాయి. రాతి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...