ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మార‌దా?

ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు అనేది అనాదిగా ఉన్న భావ‌న‌. ఏ ప్రాంత‌మైనా ఎక్క‌డ‌యినా డాక్ట‌ర్ల‌కు ప్ర‌జ‌లు ఇచ్చే గౌర‌వం అది. ప్రాణ‌దాతులుగానే భావిస్తారు. వారు చెప్పిన‌ట్టే అన్ని చేస్తారు. ఆస్పత్ర‌ల ప‌రిస్థితి బావున్నా, బాగోక‌పోయినా, బొత్త‌గా అన్యాయంగా ఉన్నా సామాన్యులు అంత‌గా ప‌ట్టించుకోరు. కార‌ణం అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్రాణ‌ర‌క్ష‌ణ క‌ల్పించేది, అందుకు న‌మ్మ‌కంగా నిలుస్తా య‌ని ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్ల ప‌ట్ల అంద‌రి న‌మ్మ‌కం. కానీ కాల‌క్ర‌మంలో ఆ న‌మ్మ‌కం దెబ్బ‌తింటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మెరుగుకు డాక్టర్ల పై నిఘా లేదా వారి ఫోన్లలో జి పి ఎస్ ట్రాకర్లు మాత్రమే సరిపోదు వైద్యు ల ప్రవర్తన తీరులో  మార్పు రావాలి. 

డాక్ట‌ర్లు కూడా ధ‌నార్జ‌న పిచ్చిలో ప‌డి ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో కంటే ప్రైవేటు ప్రాక్టీస్‌మీద‌నే ధ్యాస పెట్ట‌డం సామాన్యుల పాలిటి దుర‌దృష్టంగా మారింది. ప్ర‌భుత్వాస్ప‌త్రుల ప‌రిస్థితులు దెబ్బ‌తిన‌డానికి ఇదో కార ణంగా చెప్ప‌వ‌చ్చు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ స్థాయివారు ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్న‌ది ప్ర‌భుత్వ ఆస్ప త్రుల మీద‌నే. కానీ అవి కాల‌క్ర‌మంలో మౌలిక స‌దుపాయాలుకూడా స‌వ్యంగా క‌ల్పించ‌లేని స్థితికి జారిపో వ‌డం వారికి ప్రాణ‌సంక‌టంగా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ ప్ర‌బుత్వాస్పత్రులు, డాక్ట‌ర్ల తీరులో పెద్ద‌గా అంత‌రం లేకుండా పోయింది. రోగుల‌ను నిర్ల‌క్ష్యంగా చూడ‌టం ఎక్కువ‌యింద‌ని రోగుల బంధువులే ఫిర్యాదులు చేయ‌డం, కొన్నిప్రాంతాల్లో ఏకంగా పోలీసు కేసులు పెట్ట‌డం కూడా జ‌రిగింది. ఇది ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌కు కంక‌ణం క‌ట్టుక‌న్నామ‌ని చెప్పే ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్టే. కానీ ఆ ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఏవో కుంటిసాకులు చెప్ప‌డం త‌ప్ప ఇద‌మిద్ధం గ‌ట్టి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌డం లేదు. 

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అక్కడి వైద్యులు పట్టించుకోరు. రోగి బాధను తెలుసుకునే ప్రయత్నం కూడా కనీసం చేయరు.. పైగా మాకు తెలుసు మీరేంటి చెప్పేదంటూ రోగి తన రోగ లక్షణాలు చెప్పుకునే అవకాశం ఇవ్వరు. సందేహాల నివృత్తి మాటే ఉండ దు. రోగి తన బాధ చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. వైద్యులు పట్టించుకోరు సరి కదా..మేం చేసింది చేస్తాం  మీ సందేహాలు అనుమానాలు తీర్చాల్సిన అవసరం లేదు.  మేము చేయా ల్సింది  చేస్తాం దిక్కు న్న చోట చెప్పుకోండి అంటూ రోగిపట్ల అవమానకరంగా ప్రవర్తిస్తారన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.  

అంద‌రి ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసిన ఇటీవ‌లి క‌రోనా స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వాస్ప‌త్రులు ప్ర‌భుత్వాల ప్ర‌చారం కంటే అద్బుతంగా ఏమీ లేవు. వాస్త‌వానికి రోగి బంధువుల‌ను కూడా ఉండేందుకు అనుమ‌తిం చ‌క పోవ‌డం దారుణం. రోగి మ‌ర‌ణిస్తే మృత‌దేహాన్ని బంధువుల‌కు అప్పగించ‌డంలోనూ సిబ్బంది వ్య‌వ హ‌రించిన ప‌ద్ధ‌తి ఊహించ‌లేనిద‌ని చాలామంది రోగులు ఆస్ప‌త్రి సిబ్బందిపై తిర‌గ‌బ‌డ‌టం అనేక ప్రాం తాల్లో జ‌రిగింది. మ‌రీ చిత్ర‌మేమంటే, ఒకరికి ఇవ్వాల్సిన మృత‌దేహాన్ని మ‌రో కుటుంబానికి ఇవ్వ‌డం! ఇది ప్ర‌భుత్వాస్ప‌త్రుల నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌గా చెప్పాలి. ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టే ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇలాంటి విష‌యాల్లో ఎంతో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి స‌మా ధానం గాని, వివ‌ర‌ణ గానీ ఆయా ఆస్ప‌త్రివ‌ర్గాల నుంచి రాలేదు, వ‌స్తుంద‌న్న ఆశా లేదు. 

కోరోనా సమయం క్రిటికల్ కేర్ లో ఉన్న డాక్టర్ ఆ రోజు కాక  వారం రోజులకు వచ్చేవాడని  రోగి  పరిస్థితి అర్ధం చేసుకుని ఒక్కొక్క రు ఒక్కో ట్రీట్మెంట్ ఇచ్చా రని అసలు ఏ  చికిత్చ చేసారో కూడా తెలియని చికి త్స‌ రోగులకు అందించారు.? అన్నది ప్రశ్నా ర్ధకం గా మారింది. కొందరు  ప్రభుత్వ డాక్టర్లు నేరుగా తమ క్లినిక్ కు రావాలాని ఈ శస్త్రచికిత్చ చేయమని  తమ క్లినిక్ లో 4౦ వేలు  ఆపైన ఎంతైనా అవ్వచ్చని చెపు తూ రోగిని నిలివు దోపిడీ చేస్తున్నారు.  ఇటీవల రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరే షన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సర్జరీ తరువాత సమస్యలు వచ్చాయని రోగి అంటున్నా అలాగే ఉంటుంది అంటూ చెప్పిన సమాధానం ప్రాణాలకు డాక్టర్ వెలకట్టిన తీరు బాధ్యత రాహిత్యం సిబ్బంది ప్రవార్తనా తీరు విస్మయం కలిగిస్తోంది సగటు మధ్య తరగతి వారిపట్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకింత నిర్లక్ష్యం.? 

గ్రామీణ‌ప్రాంతాలు, గిరిజ‌న ప్రాంతాల్లో ప‌రిస్థితులు వ‌ర్ణ‌నాతీతం. అనాదిగా ఈ ప్రాంతాల్లో రోగుల‌ను చేరేం దుకు రోడ్డు సౌక‌ర్యం కూడా లేక‌పోవ‌డం విచార‌క‌రం. రోగులను త‌ర‌లించ‌డం కూడా డోలీలో జ‌రుగుతోంది. శాసన సభలో ఏళ్ల తరబడి ప్ర‌జారోగ్యం గురించి  విప‌క్షాలు గొంతు చించుకున్నా,  ఎం ఎల్ ఏ నిధులు రావు ఎం పి నిధులు రావు సగటు గిరిజనుల గోడు ప్రభుత్వాలకి కనపడదు వినపడదు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం దేశ వ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రా లలో ఒకే డాక్టర్ సరిగా లేని వైద్య సిబ్బంది. సిబ్బంది కొరత, మండులకోరత ,అత్యవ సరమైన సమయం లో చేయాల్సిన చికిత్చకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనించారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్,లో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూర్ జిల్లలో మహారాష్ట్రా, తమిళనాడు, రాజస్థాన్, కేరళ, అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో సైతం ఇదే దుస్థితి నేల కొనడాన్ని తీవ్రంగా  తప్పుపట్టింది. ఒకవైపు నిధులు లేవని రాష్ట్రాలు అంటుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహించాల్సిన బాధ్యత  రాష్ట్రాలదే అని కేంద్రం  అందం మీరంటే మీరంటు సగటు మధ్యతరగతి వర్గానికి ఆరోగ్యాన్ని అందించే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను నిర్లక్ష్యం చేసాయని అన డంలో ఏమాత్రంసందేహం లేదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu