ఎక్కువ సేపు కూర్చునే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు..!

ఎక్కువ సేపు కూర్చోవడం.. చాలా మంది దీని గురించి పెద్దగా ఆలోచించరు కానీ.. ఆఫీసుల్లో, ఇంట్లో ఇట్లా చాలా చోట్ల గంటల కొద్దీ ఎక్కువ సేపు ఒకేచోట కూర్చొంటారు.  ఆఫీసుల్లో సిస్టమ్ ల ముందు, ఇంట్లో టీవీ ల ముందు గంటల కొద్ది కూర్చోవడం చాలా మందికి చాలా కామన్ గా ఉంటుంది.  స్త్రీలతో పోలిస్తే మగవాళ్లు ఇలా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం  అనేది ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇలా ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం అనేది ఆరోగ్యానికి చాలా చెడ్డది అంటున్నారు వైద్యులు.  ఇది  శరీరానికి, మనసుకి కూడా హానికరమట. దీని వెనుక  వైద్య కారణాలు,  ఆరోగ్య సమస్యలు చాలా  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..

శరీరంపై ప్రభావం..

రక్త ప్రసరణ తగ్గిపోవడం..

ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలో, వెన్నులో రక్తం సరైన రీతిలో ప్రసరించదు. దీని వల్ల deep vein thrombosis (DVT) అనే రక్త గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

గుండె ఆరోగ్యం దెబ్బతినడం..

కదలికలు లేని జీవన శైలి వల్ల శరీరంలో కొవ్వు నిల్వ ఎక్కువ అవుతుంది. దీని వల్ల రక్తపోటు, హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

బరువు పెరగడం (Obesity)

శరీరం కాలరీలు ఖర్చు చేయకపోవడం వలన అదనపు కొవ్వు పేరుకుపోతుంది. ఇది అధిక బరువుకు,  తద్వారా ఊబకాయానికి దారి తీస్తుంది.  దీని వల్ల మధుమేహం (Type-2 Diabetes) వచ్చే అవకాశాలు ఎక్కువ.

మసిల్స్, ఎముకల బలహీనత..


ఎక్కువ సేపు కూర్చోవడం వలన వెన్ను, మెడ, భుజాలు నొప్పులు వస్తాయి. ఎముకలు బలహీనపడి osteoporosis వచ్చే ప్రమాదం ఉంటుంది.

మెదడుపై ప్రభావం..

రక్త ప్రవాహం తగ్గడం వలన మెదడుకు తగిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దీని వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి  తగ్గిపోతాయి.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం..

ఒత్తిడి, ఆందోళన  పెరగడం..

శరీర కదలికలు తగ్గిపోతే హ్యాపీ హార్మోన్స్ గా పరిగణించే సెరటోనిన్, డొపమైన్, ఎండోర్ఫిన్స్   (serotonin, dopamine, endorphins) తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ తగ్గడం వల్ల డిప్రెషన్ సమస్యకు దారితీసే అవకాశం  ఉంటుంది. ఎక్కువసేపు శరీరం యాక్టివ్ గా లేకుండా కూర్చుని ఉండటం వల్ల  మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

దీర్ఘకాలిక సమస్యలు..

గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, రక్తపోటు, కాన్సర్ వంటి పెద్ద వ్యాధుల అవకాశాలు పెరుగుతాయి. జీవన కాలం (life span) తగ్గిపోతుంది అని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.

 నివారణ కోసం ఏం చేయాలి..


ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవాలి.
కూర్చునే సమయంలో పొజిషన్  సరిగా ఉంచాలి.
సాధ్యమైనంతవరకు standing desk వాడుకోవాలి.
రోజూ కనీసం 30 నిమిషాలు brisk walking, యోగా లేదా వ్యాయామం చేయాలి. స్క్రీన్ టైమ్ (computer/phone) తగ్గించాలి.
ఎక్కువ సేపు కూర్చోవడం అనేది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి ముప్పు కూడా.

                         *రూపశ్రీ

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu