మైగ్రేన్ వేధిస్తోందా? ఈ అలవాట్లతో మాయమవుతుంది..!

 


నేటి వేగవంతమైన జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి. ఇల్లు, ఆఫీస్, పిల్లలు,  రిలేషన్స్  మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి, తప్పించుకోలేనివి. ఇవన్నీ ఎప్పుడైనా కాస్త ఒత్తిడిగా అనిపిస్తే చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు.  అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాకపోయినా  మైగ్రేన్‌ అనేది ఒక విధమైన తలనొప్పి. ఈ మైగ్రేన్ వల్ల ప్రతి రోజు చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పికి మాత్రమే కాకుండా వికారం, అలసట,  కాంతి లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటివి కూడా జరుగుతాయి.  దీనిని మందులు మరియు సరైన జీవనశైలితో నియంత్రించవచ్చు.

మంచి ఆరంభం..

మంచి ఆరంభం మొత్తం రోజు శక్తిని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ  నిర్దిష్ట సమయంలో మేల్కొలపడం అలవాటు చేసుకోవాలి. అది రోజు మొత్తం శక్తిని నిర్ణయిస్తుంది. మేల్కొన్న వెంటనే ఫోన్ లేదా స్క్రీన్ వైపు చూడకూడదు. కొన్ని నిమిషాలు గడిచిన తరువాత  యోగా లేదా ధ్యానం కోసం కనీసం  10-15 నిమిషాలు సమయం కేటాయించాలి. అనులోమ-విలోమ,  భ్రమరి వంటి ప్రాణాయామాలు ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ తీవ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి.

అల్పాహారం చాలా ముఖ్యం..

ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉంటే మైగ్రేన్ త్వరగా వస్తుంది. కాబట్టి అల్పాహారం మిస్ అవ్వకూడదు. ఓట్స్, జావ, పండ్లు లేదా మొలకలు లేదా ఇతర టిఫిన్స్  వంటి పోషకమైన అల్పాహారం మాత్రమే తినాలి. టీ-కాఫీ,  ఎనర్జీ డ్రింక్స్ మానుకోవాలి. ఎందుకంటే అధిక కెఫిన్ కూడా ఈ తలనొప్పిని పెంచుతుంది.

స్క్రీన్ కు దూరం..

నిరంతరం స్క్రీన్ వైపు చూడటం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. కానీ ఆఫీసులో నిరంతరం స్క్రీన్ వైపు చూడటం  తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో ప్రతి 30 నిమిషాలకు 1-2 నిమిషాలు మీ కళ్ళను స్క్రీన్ నుండి మరల్చాలి.  వీపు నిటారుగా ఉండాలి, స్క్రీన్ కంటి స్థాయిలో ఉండాలి.  పాదాలు నేలపై ఉండాలి.

నీరు..  

మైగ్రేన్‌లో రోజంతా తగినంత నీరు త్రాగడం ముఖ్యం.  ఎందుకంటే డీహైడ్రేషన్ మైగ్రేన్‌ను పెంచుతుంది. ఒత్తిడి మధ్య ప్రశాంతంగా ఉండటానికి, లోతైన శ్వాస తీసుకోవాలి.  వాకింగ్ లేదా ఇష్టమైన సంగీతాన్ని వినడం వంటివి మానసిక స్థితిని మెరుగుపరచడంలో అలాగే మైగ్రేన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.

ట్రిగ్గర్‌లు.

మైగ్రేన్ ట్రిగ్గర్‌లు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి.  ఎక్కువ వెలుగు, పెద్ద శభ్దాలు,  ఆకలి, కాలానుగుణ మార్పులు,  ఎక్కువ స్క్రీన్ చూడటం వంటివి. మైగ్రేన్ వచ్చినరోజు ఆహారం, నిద్ర సమయం, ఒత్తిడి, వాతావరణం,  స్క్రీన్ సమయం గమనించాలి. ఇది మైగ్రేన్ ట్రిగ్గర్‌ను తెలుసుకోవడానికి  సహాయపడుతుంది.

సాయంత్రం..

రోజంతా  హడావిడిగా గడిచిన  తర్వాత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి తేలికపాటి నడక, తోటపని, పెయింటింగ్ లేదా  విశ్రాంతినిచ్చే ఏదైనా ఇతర పని చేయాలి.

నిద్ర..

తగినంత నిద్ర మైగ్రేన్ రోగులకు ఔషధం కంటే తక్కువ కాదు. కాబట్టి 7–8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోయే ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. గది వెలుతురు మసకగా,  వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఫాలో అయితే మైగ్రేన్ మాయమవుతుంది.

                         *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu