సానుకూల దృక్ఫథంతో సవాళ్లను అధిగమించా.. విద్యార్థులతో నారా లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.   సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న కుట్రలు జరిగాయి. పప్పు అంటూ బాడీ షేమింగ్,  హేళనలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నాలు జరిగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ , మీమ్స్ తో లోకేష్ రాజకీయ ఎదుగుదనలను ఆరంభంలోనే అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాలన్నిటినీ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్ర వరంలో శుక్రవారం (డిసెంబర్ 19) విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. వాటన్నిటినీ అధిగమించడానికి తాను ఏం చేశారో పంచుకున్నారు.  

తన శక్తిని అటువంటి ట్రోలింగ్స్, మీమ్లను ఖండించడానికీ, బుదలు ఇవ్వడానికీ వృధా చేయ కూడదని అందుకు బదులుగా  రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగడంపైనే దృష్టి సారించాననీ వివరించారు. తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో  పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.  తనకు ఎదురైన ప్రతి సవాలును సానుకూల దృక్ఫ థంతో ఎదుర్కొన్నానని చెప్పారు.  ఒక అడుగు వెనక్కి వేస్తే సరిదిద్దుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చెప్పారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu