2021లో టాప్ గూగుల్ ట్రెండ్స్ ఏంటో తెలుసా..?

బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. వెంట‌నే జ‌నాలంతా గూగుల్‌లో వెతికారు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ తెలుసుకున్నారు. రావ‌త్ అనే కాదు.. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మాచారం కావాల‌న్నా.. గూగుల్ త‌ల్లిని అడిగేస్తుంటారు. క‌రోనా టైమ్‌లో అయితే.. గూగులే అంద‌రికీ దిక్చూచిగా నిలిచింది. ఇక క్రికెట్ మ్యాచ్‌లు అయితే.. గూగుల్‌లో లైవ్ అప్‌డేట్స్ చూడాల్సిందే. ఇలా.. 2021లో గూగుల్‌లో మోస్ట్ ట్రెండింగ్‌గా నిలిచిన టాపిక్స్ ఏంటో తెలుసా...? తాజాగా, 2021లో భారతీయులు గూగుల్‌ లో ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్ విడుదల చేసింది. అవేంటంటే....

లాస్ట్ ఇయ‌ర్‌లానే.. ఈ ఏడాది కూడా కరోనా, వ్యాక్సినేష‌న్ టాపిక్‌ టాప్‌లో నిలుస్తుంది అనుకున్నారు. కానీ, క‌రోనా సెర్చ్‌ను దాటేసి.. క్రికెట్ దూసుకుపోయింది. ఇండియాలో ఐపీఎల్‌కు ఎంత ఆద‌ర‌ణ ఉందో చాటిచెప్పింది. ఈ ఏడాది ఎక్కువ మంది ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ గురించి ఎక్కువగా వెతికారు. టాప్‌ 10 జాబితాలో ఐపీఎల్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా.. కొవిన్‌ పోర్టల్ సెకండ్ ప్లేస్‌లో, ఐసీఐసీఐ టీ20 వరల్డ్‌ కప్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో యూరో కప్‌, టోక్యో ఒలింపిక్స్‌ నిలిచాయి. 

1. ఐపీఎల్ |   2. కొవిన్ పోర్టల్‌ |   3. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ |   4. యూరో కప్‌ |   5. టోక్యో ఒలింపిక్స్‌ |   6. కొవిడ్ వ్యాక్సిన్‌ |   7. ఫ్రీ ఫైర్‌ రిడీమ్ కోడ్‌ |   8. కోపా అమెరికా   9. నీరజ్‌ చోప్రా |   10. ఆర్యన్‌ ఖాన్‌

 

మూవీ కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్‌ సినిమా గురించే గూగుల్‌ చేశారు. జై భీమ్‌ తర్వాత ఎక్కువగా షేర్షా సినిమా గురించి వెతికారు. ఇక మిగ‌తా టాప్ 10 మూవీ సెర్చెస్ ఏంటంటే..

1. జై భీమ్‌ | 2. షేర్షా | 3. రాధే | 4. బెల్‌బాటమ్‌ | 5. ఎటర్నల్స్‌ | 6. మాస్టర్‌ | 7. సూర్యవంశీ | 8. గాడ్జిల్లా vs కాంగ్ | 9. దృశ్యం 2 | 10. భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా  

 

వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలిపింక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో ఇండియాకు గోల్డ్ మెడ‌ల్‌ అందించిన నీరజ్‌ చోప్రా గురించి ఎక్కువ మంది యూజర్స్ గూగుల్ చేశారు. తర్వాత షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్ కోసం వెతకగా, మూడో స్థానంలో నటి షెహనాజ్‌ గిల్‌, నాలుగులో రాజ్‌ కుంద్రా, ఐదులో ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. ఇక టాప్ 10లో ఉన్నావారు ఎవ‌రంటే...

1. నీరజ్‌ చోప్రా | 2. ఆర్యన్‌ ఖాన్‌ | 3. షెహనాజ్‌ గిల్‌ | 4. రాజ్‌ కుంద్రా | 5. ఎలాన్‌ మస్క్‌ | 6. విక్కీ కౌశల్ | 7. పీవీ సింధు | 8. బజరంగ్‌ పునియా | 9. సుశీల్‌ కుమార్‌ | 10. నటాషా దలాల్‌  

Near Me అంటూ అందుబాటులో ఉన్న సేవల గురించి వెతికే జాబితాలో ఎక్కువ మంది కొవిడ్‌కు సంబంధించిన సమాచారం గూగుల్ చేశారట. 

1. కొవిడ్ వ్యాక్సిన్‌ |   2. కొవిడ్ టెస్ట్‌ |   3. ఉచిత ఫుడ్ డెలివరీ |   4. ఆక్సిజన్ సిలిండర్‌ |   5. కొవిడ్ ఆస్పత్రి |   6. టిఫిన్‌ సర్వీస్‌ |   7. సీటీ స్కాన్‌ |   8. టేకవుట్ రెస్టారెంట్ |   9. ఫాస్టాగ్‌ |   10. డ్రైవింగ్ స్కూల్‌  

What is.. అంటే ఏమిటీ.. అంటూ నెటిజ‌న్లు ఆస‌క్తిగా సెర్చ్ చేసిన అంశాలు ఈ ఏడాదిలో చాలానే ఉన్నాయి. అందులో ప్ర‌ముఖంగా సెర్చ్ చేసిన టాపిక్స్ ఇవే...

1. బ్లాక్‌ఫంగస్‌ | 2. ఫాక్టోరియల్ ఆఫ్‌ హన్రెండ్‌ | 3. తాలిబన్‌ | 4. అఫ్గాన్‌లో ఏం జరుగుతోంది | 5. రెమెడెసివిర్‌ | 6. స్క్వేర్‌ రూట్‌ ఆఫ్‌ 4 | 7. స్టెరాయిడ్ | 8. టూల్‌కిట్‌ | 9. స్క్విడ్‌ గేమ్‌ | 10. డెల్టా ప్లస్ వేరియంట్   

How To.. ఎలా చేయాలి అంటూ ఎక్కువ మంది గూగుల్ చేసిన టాపిక్స్ ఏంటంటే.. 

1. కొవిడ్ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ | 2. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ | 3. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవడం | 4. పాన్‌-ఆధార్‌ లింక్‌ | 5. ఇంట్లోనే ఆక్సిజన్ తయారీ | 6. ఇండియాలో క్రిప్టోకరెన్సీ కొనుగోలు | 7. బనానా బ్రీడ్ తయారీ | 8. ఐపీఓ కేటాయింపులు | 9. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు | 10. మార్కుల పర్సంటేజ్ లెక్కింపు  

ఇక‌, వంటల కేటగిరీలో ర‌క‌ర‌కాల డిషెష్ గురించి శోధించారు నెటిజ‌న్లు. వాటిలో పుట్టగొడుగులు, ఆవిరి కుడుములు, మెతీ మటర్‌ మలాయి, పాలక్‌, చికెన్‌ సూప్‌ల గురించి ఎక్కువగా వెతికినట్లు గూగుల్ సంస్థ‌ తెలిపింది. 

ఇక న్యూస్ త‌దిత‌ర అంశాల్లో.. టాప్ 10 గూగుల్ టాపిక్స్‌...

1. టోక్యో ఒలిపింక్స్‌ | 2. బ్లాక్ ఫంగస్‌ | 3. అఫ్గాన్ వార్తలు | 4. పశ్చిమబెంగాల్ ఎన్నికలు | 5. ట్రాపికల్‌ సైక్లోన్‌ | 6. లాక్‌డౌన్‌ | 7. సూయజ్‌ కెనాల్ క్రైసిస్‌ | 8. రైతుల నిరసన | 9. బర్డ్‌ ఫ్లూ | 10. సైక్లోన్‌ యాస్‌