బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక.. దీటుగా స్పందించిన చైనా
posted on Jul 7, 2025 3:22PM

డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు. బ్రెజిల్‌లో బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పెసిఫిక్ గా బ్రిక్స్ పేరు ఎత్తకుండానే ఆయన ఆ కూటమిని ఉద్దేశించే సుంకాల పెంపు వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భారత ప్రధాని మోడీ సహా సభ్య దేశాధినేతలందరూ అమెరికా సుంకాల విధానాన్ని ప్రస్తావించి విమర్శలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఎదురుదాడి అన్నట్లుగా అదనంగాపదిశాతం సుంకాల హెచ్చరిక జారీ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇలా ఉండగా ట్రంప్ తాజా హెచ్చరికపై చైనా దీటుగా స్పందించింది. తాము ఘర్షణను కోరుకోవడం లేదని పునరుద్ఘాటిస్తూను టాక్స్ వార్ లో ఎవరూ గెలవరని పరోక్షంగా ట్రంప్ ను హెచ్చరించింది. గతంలో అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధం నడిచినప్పటికీ, ఆ తర్వాత కుదిరిన ఒప్పందంతో అది తాత్కాలికంగా సద్దుమణిగిన సంగతి విదితమే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.