తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరి మృతి

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో  దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.  సైకో దాడిలో కనీసం ముగ్గురు గాయపడ్డారు. ఒకరు మరణించారు. మృతుడిని శేఖర్ గా గుర్తించారు.

ఇక కపిలతీర్థం పార్కింగ్ స్థలంలో పని చేసే సుబ్రహ్మణ్యం, అదే ప్రాంతంలో నివసించే కల్పనలకు కల్పన గాయపడ్డారు. గాయపడని వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.   సైకో వీరంగంతో దాదాపు గంట సేపు ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనలతో వణికిపోయారు. చివరకు అతి కష్టం మీద స్థానికులు, పోలీసులు, మునిసిపల్ సిబ్బంది సైకోను వల వేసి పట్టుకున్నారు. అనంతరం ఆ సైకోనుదాదాపు గంటసేపు స్థానికులు, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది ప్రయాసలు పడి నిందితున్ని వలవేసి పట్టుకున్నారు. అనంతరం  ఆస్పత్రికి తరలించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu