కేసీఆర్ వల్లే గెలిచాం.. దయాకర్
posted on Nov 24, 2015 12:04PM
.jpg)
వరంగల్ ఉపఎన్నిక పోరులో దాదాపు టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ దే గెలుపు ఖాయమని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ నేతలు బాణసంచా కాలుస్తూ.. డప్పులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపించాయని ఆయన అన్నారు. తనను గెలిపించినందుకు ప్రజలకు ఉపయోగపడేలా పనిచేస్తానని.. కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను నిర్వర్తించడానికి శాయశక్తులా కృషిచేస్తానని.. వరంగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అందరి సహకారంతోనే ఈ విజయం సాధించామని ప్రజల కోసం, పార్టీ బలోపేతంకోసం కృషి చేస్తానని దయాకర్ స్పష్టం చేశారు.
కాగా ఇప్పటివరకూ 16 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ అభ్యర్ధి 4 లక్షల ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ - 1,37,852
బీజేపీ - 1,12,880
వైసీపీ - 20,747