కడియం ఓట్లకు గండికొడుతున్న కొడవలి

రంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేస్తున్న కడియం శ్రీహరికి సిపిఎం అభ్యర్ధి పెద్ద ఇబ్బందిగా మారారు. ఈ ఎన్నికల్లో సిపిఎం తరపున పోటీచేస్తున్న ఇలిషన్ గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినప్పటికీ ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయో ఆ మేరకు కడియం శ్రీహరి ఓటుబ్యాంక్ కు గండిపడుతుందని తెలుగుదేశం నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఇక్కడ రంగంలో ఉన్నాయి. ఈసారి సిపిఎం ఒంటరిగా రంగంలోకి దిగింది. తమ అభ్యర్ధికి 10వేల వరకు ఓట్లు వస్తాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగయ్య అంటున్నారు. నిజంగా ఇన్ని ఓట్లు ఇలిషన్ కు వస్తే టిడిపి అభ్యర్ధి కడియం శ్రీహరికి పెద్ద దెబ్బతగిలినట్లే. 2009 ఎన్నికల సమయంలో సిపిఎం, తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే వీరి మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా స్టేషన్ ఘన్ పూర్ లో సిపిఎం అభ్యర్ధి నలిగంటి రత్నమాల పోటీచేశారు. ఆమెకు అప్పట్లో సుమారు 5వేల ఓట్లు వచ్చాయి. మహాకూటమిలో విభేదాలవల్ల సిపిఎం పోటీచేయడంతో టిడిపి అభ్యర్ధి కడియం శ్రీహరి బాగా నష్టపోయాడు. మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుందేమోనని టిడిపి నాయకులు భయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu