సడలుతున్న నాగం ధీమా
posted on Mar 13, 2012 1:34PM
మ
హబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి ధీమా ఇటీవల కాస్త సడలినట్లు కనిపిస్తోంది. నాగంజనార్ధనరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పటికి ఆయనకు టిఆర్ఎస్ మద్దతునైతే ప్రకటించింది కాని ఆ పార్టీ నాయకులెవరూ మనస్పూర్తిగా నాగం వెంట ప్రచారంలో తిరగడం లేదనే అపవాదులను ఎదుర్కొంటున్నారు . దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తెలాంగాణ వాదం కాస్త బలహీనపడింది ఇది నాగం వర్గీయులకు ఆందోళన కలిగిస్తోంది . గతంలో టిడిపి తరుపున గెలుపొందిన నాగం ఇప్పుడు స్వతంత్ర అభ్యర్దిగా రంగంలో ఉన్నారు. టిడిపి తరుపున మర్రి జనార్దనరెడ్డి పోటిచేస్తుంన్నారు . దీనివల్ల నాగం జనార్దనరెడ్డి కి వచ్చే ఓట్లలో కొన్ని మర్రి జనార్దనరెడ్డి చీల్చు కునే అవకాశం ఉంది.
దీనికి తోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలంగానే ఉంది . ఈ నియోజకవర్గంలో కాంగ్రస్ పార్టీ కి 55వేలనుంచి 60వేల ఓట్ల వరకు పోలవుతూ వస్తున్నాయి . ఇప్పుడు నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటిచేస్తున్న కూచూపుళ్ళ దామోదర్ రెడ్డి గత ఎన్నికలో నాగ జనార్దనరెడ్డి పై 6,500ఓట్ల తేడాతో ఓడిపోయారు . 2004ఎన్నికల్లో కూచూపుళ్ళ కేవలం 1500ఓట్ల తేడాతో ఓడిపోయారు . ఈ రెండు ఎన్నికలో ఆయనకు మొదటిసారి 55వేలు ,రెండో సారి 60వేల ఓట్లు పొలయ్యా యి .ఈ సారి పరిస్తితి మరింత మేరుగువుతుం దని దామోదర్ రెడ్డి వర్గియులు అంచనా వేస్తున్నారు .