తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలకు రేపటితో ముగింపు

తిరుమల పుణ్యక్షేత్రంలో గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం (జనవరి 8)తో  ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం చుకుని, గత ఏడాది డిసెంబర్ 30నుంచి భక్తులకు టీటీడీ  ఉత్తర ద్వార దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే.  శాస్త్రోక్తంగా పది రోజుల పాటు భక్తులకు  ఉత్తర ద్వార దర్శనాలకు అవకాశం కల్పించిన  తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం (జనవరి 8) అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య  ఉత్తర ద్వారాలను అధికారికంగా మూసివేయనుంది.

కాగా ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించిన పది రోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఎల్లుండి నుంచి తిరుమల కొండపై   బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఇతర ప్రత్యేక దర్శనాలు   ప్రారంభం కానున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu