పోలవరం సందర్శించిన సీఎం చంద్రబాబు.. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును బుధవారం (జనవరి 7) సందర్శించారు.  ఉదయం   ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన  ప్రాజెక్టు వద్దకు చేరున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనుల వేగం పెరిగిన సంగతి తెలిసిందే.     
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.  

కాగా ప్రాజెక్టు పనులు ఇప్పటికే 88 శాతం మేర పూర్తి అయ్యాయి.  చంద్రబాబు పోలవరంప్రాజెక్టు సందర్శనలో భాగంగా  ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, బట్రస్ డ్యామ్, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వంటి పనులను ఆయన తనిఖీ చేశారు.  అనంతరం జలవనరుల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి,  ప్రాజెక్టు పనులు, కుడి, ఎడమ కాలువల అనుసంధానం వంటి అంశాలపై చర్చించి, తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత అక్కడే అధికారులతో సమీక్ష  నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై వివరించే అవకాశం ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu