తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ
posted on Jan 8, 2026 2:33PM

పులికాట్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ ఫెస్టివల్ నిర్వహణ తొలి సారిగా గత ఏడాది నిర్వహించినట్లు తెలిపిన ఆయన ఈ ఏడాది జనవరి 10, 11 తేదీలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు వివరించారు. పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటక అభివృద్ధి లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఫ్లెమింగో ఫెస్టివల్–2026 పక్షుల పండుగకు ఆహ్వానం పలుకుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురువారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. తిరుపతి తారకరామ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని పలు ప్రధాన రహదారుల గుండా సాగింది.ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఫ్లెమింగో పక్షుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.