ఆసియా డాక్టర్ పై దాడి... విమానం నుంచి ఈడ్చిపారేశారు
posted on Apr 11, 2017 12:14PM

విమానం నిండిపోయిందన్న కారణంతో ఓ ప్రయాణికిడిని అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ చెందిన విమానంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...అమెరికాలోని షికాగో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కెంటకీలోని లూయిస్ విల్లే యునైటెడ్ 3411 విమానంలో ఎక్కి కూర్చున్న ఓ ప్రయాణికుడి వద్దకు వచ్చిన సిబ్బంది ఆయనను దిగాలని చెప్పారు. తాను తప్పనిసరిగా ఇంటికి వెళ్లాల్సివుందని.. తాను వైద్యుడినని ఇంటికి తిరిగివెళుతున్నానని..దిగడానికి ఒప్పుకోకపోవడంతో దీంతో అతడిని చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోయారు సిబ్బంది. ఆ ప్రయాణికుడు కిందపడిపోయినా అలాగే విమానం బయటకు లాక్కెళ్లడంతో అతడికి గాయాలయ్యాయి. ఈ దుశ్చర్యను వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు సదరు ప్రయాణికుడు ఆసియా వాసి అని.. తాను వైద్యుడినని తాను తప్పనిసరిగా తన స్వస్థలానికి వెళ్లాలని చెబుతున్నప్పటికీ విమాన సిబ్బంది వినిపించుకోలేదని తోటి ప్రయాణికులు చెప్పారు.