ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. సహాజంగా మన ఎముకలు బలహీనంగా ఉంటాయి. అయితే వయస్సుతో సంబంధం లేకుండా మన జీవితంతో కలిసి జీవిస్తాయి. మళ్ళీ నిర్మితం అవుతూ ఉంటాయి. వయస్సు తగ్గుతున్నకొద్దీ  మీరు మీ కాల్షియం బ్యాంకు నుంచి కొంత శక్తిని పొందవచ్చు. ఈ సమస్యను ఒస్టియో ప్రోరోసిస్ అంటారు. ఇది ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత, కాల్షియం లోపం వల్ల వస్తుంది. ప్రోరోసిస్ సమస్యను సులభంగా నివారించవచ్చు.

ఎముకల చివర వచ్చే సమస్యకు వయస్సుతో సంబంధంలేదు. ఎముకలకు, కండరాలకు ఉండే టిష్యూ మరలా పునర్నిర్మిస్తుంది. ఈ సమస్య ప్రధానంగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వస్తుంది. శరీరంలో అప్పటికే నిల్వ ఉన్న శక్తిని వయస్సు పెరిగే కొద్ది తిరిగి పొందవచ్చు. ఏ వయస్సులో ఐనా ఎముకలలో శక్తిని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి కాల్షియం అవసరమని నిపుణులు తేల్చారు.  

సహాజంగా అమెరికన్లు మినరల్స్ ఎక్కువగా పొందలేని కారణంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండవు. కాల్షియం మాత్రమే ఎముకలను బలంగా ఉంచుతుంది.  మీ శరీరంలో కాల్షియం శాతం తగ్గినట్లయితే మీ శరీరం నుంచే మళ్ళీ తీసుకుంటుంది. శరీరంలో ఎక్కువగా కాల్షియం తగ్గితే ఒస్టియో ప్రోరోసిస్ సమస్యలు వస్తాయి. దీనివల్ల మీ ఎముకలు విరిగిపోవడం, ఎముకలలో ఉండే రాపిడికి రజను రాలిపోడం సంభవిస్తుంది. మీకు 50 సంవత్సరాలు వచ్చాయా.. మీరు ప్రతిరోజూ 1200 మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇలా కాల్షియం తీసుకోడం వల్ల ఎముకలకు జరిగే నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు. పాలు, తమలపాకులో వేసే సున్నం కాల్షియం ఇస్తుంది. విటమిన్ సి కాల్షియం పెంచవచ్చు అంటున్నారు. 18-19 సంవత్సరాల వయస్సులో ఉండే వారికీ కొంత కాల్షియం నిల్వ ఉంటుంది.  ఒకకప్పు పెరుగు- లేదా మీగడ, ఉడికించిన బీన్స్, విటమిన్ డి మందులు, చేపలు, ఆవుపాలు, బాదం, సోయా, ఓట్స్ , గుడ్లు , పోర్క్ , దీనితోపాటు వ్యాయామం చేయడం వల్ల ఎముక్సలు మరింత బలంగా ఉంటాయి. 

పెద్దవాళ్ళు ఎవరైతే వర్క్ అవుట్ చేస్తారో బోన్ లాస్ ను నివారించవచ్చు. 30లో ఎముకల వ్యాయామం చేయడం వల్ల మజిల్ నిర్మితమౌతుంది. ఎముకలలో డి విటమిన్ పెరుగుతుంది. ఉత్తమ వ్యాయామం ఎముకలను నిర్మిస్తుంది. రన్నింగ్, నడక , నృత్యం, మెట్లు ఎక్కడం దిగడం , ఎముకలలో బలాన్ని పెంచుతుంది . జాగింగ్ వల్ల ఎముకలు గట్టిపడతాయి. కాళ్ళలో, పాదాలలో ఎముకలు గట్టి పడతాయి. చేతులలో ఎముకలు గట్టి పడాలంటే పుషప్స్, రోవింగ్, రెసిస్టెంట్ట్ బ్యాండ్స్ వాడవచ్చు. అయితే పొగ తాగడం మానివేయాలి. 

అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఒస్టియో ప్రోరోసిస్ సమస్యతో బాధపడుతున్నారు. నికోటిన్ ఇతర రసాయనాలు పొగాకు, ఎముకలలో నిర్మాణ గతిని తగ్గిస్తాయి. మీ ఎముకలకు రక్తప్రసారాన్ని తగ్గిస్తాయి. ఎముకలు బలహీన పడడం వల్ల వెన్నెముకలో రక్తప్రసారం తగ్గుతుంది. సాఫ్ట్ డ్రింక్స్, కుకీలు, ఇతర ప్రాసేసుడ్ ఫుడ్స్ లో చాలా చక్కెర ఉంటుంది. చక్కర మీ ఎముకలలో ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. కాల్షియం మెగ్నీషియం ఎక్కించుకోవాల్సి వస్తుంది. పేగులలో కాల్షియం తగ్గించుకోవాలి. ఆహారంలో న్యుట్రీషియన్స్ మార్చాలి. మీరు తీసుకునే మద్యం వల్ల ఎముకల వృద్ధి మందగిస్తుంది. ఈ సమస్య మరింత ముదిరితే ఆస్టియో బ్లాస్ట్ వల్ల ఎముకలు విరిగిపోతాయి. వెజిటేరియన్ ప్రోటీన్లు నిమ్మ, బత్తాయి రసం, సంత్రా రసం, ఆకుకూరలు న్యూట్రిషియన్స్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ద్రాక్షపళ్ళు, సిట్రస్, విటమిన్ సి, ఎముకలలో బలాన్ని పెంచుతాయి. చేపలు, బ్రెడ్ సాండ్ విచ్, పాలు, కొబ్బరిపాలు తదితరాలు తీసుకుంటే మీ ఎముకలు బలంగా ఉంటాయని నిపుణులు చెపుతున్నారు.