బాదంపప్పుతో 10 రకాల లాభాలు            

బాదం పప్పు రుచికరంగా ఉండడమే  కాదు.. ఎంత శక్తివంతమో తెలుసుకుందాం. బిపి, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారికి పీచుపదర్ధాన్ని అందిస్తుంది. బాదం పప్పు వల్ల పోషక విలువలు మరెన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. ఒక ఔన్స్ బాదం పప్పులో 165 క్యాలరీలు, 6 గ్రాముల కార్బో హైద్రేట్స్, 35 గ్రాముల పీచుపదార్ధాలు ఉంటాయి. కొవ్వువల్ల వచ్చే హృద్రోగ సమస్యలనుండి నివారించేది బాదం పప్పుమాత్రమే అంటే అతిశయోక్తి కాదు. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో బాదం  కీలక  పాత్ర పోషిస్తుందని  వైద్యులు పేర్కొన్నారు. 1/3 వంతు కప్పు బాదం పప్పు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. బాదం పప్పులో కాల్షియం లభిస్తుంది. దీనివల్ల బాదం శరీరంలోని ఎముకల నిర్మాణానికి దోహదం చేస్తుంది. రక్తనాళాలలో రక్తం గడ్డ కడితే బాదం దీనిని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన కండరాలు, బలమైన గుండెకు దోహదం చేసేది బాదం పప్పే. మీకు ఒకవేళ ఎలర్జీ ఉంటే అంటే ముఖ్యంగా పాలుత్పత్తులు ఇతర పదార్ధాలవల్ల ఎలర్జీ ఉంటే వీటి స్థానంలో ఆవుపాలకు బదులు బాదం పాలు వాడవచ్చు. ఈ పాలలో లాక్టోసీస్, కొలెస్ట్రాల్ లేకుండా ఉంటాయి. ఆహారంలో పీచుపదార్ధం అత్యవసరం. మీ రక్తంలో చక్కర నిల్వను తగ్గిస్తుంది. హృద్రోగ సమస్యకు చెక్ పెట్టేది బాదం మాత్రమే. 23 బాదం పప్పులకు 25 గ్రాముల పీచుపదార్ధం లభిస్తుంది. శరీరంలో వచ్చే ముడతలను నివారిస్తుంది. మెటబాలిజం ను వృద్ధి చేస్తుంది. అందరు ఎదుర్కొంటున్న  అధిక బరువు నుంచి బయటపడేందుకు బాదం ఉపయోగ పడుతుంది. సెలోటోనియం లెవెల్ ను నియంత్రిస్తూ నిద్రను నియంత్రించడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పగలు మేల్కొని రాత్రి సుఖంగా నిద్రపోవచ్చని నిపుణులు  వెల్లడించారు. అరకప్పుబాదం తీసుకోవడంవల్ల శరీరం లోని ఆర్గాన్లు మెరుగు పడతాయని సెక్స్ జీవితం సంతృప్తికరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. బాదం పప్పులు విటమిన్ ఇ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరంలో కణాలు నాశనం కాకుండా కాపాడుతాయి. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు ఆల్జీమర్స్ , క్యాన్సర్ ను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ల్యాక్టో బేసిలెస్ వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు  సహాకరిస్తుంది. ఇన్ఫెక్షన్ ల నివారణకు అవసరమైన రసాయనాలు బాదం అందిస్తుంది.