తల్లిదండ్రులు నేర్పలేని.. ఉపాధ్యాయుడు  మాత్రమే నేర్పగల 5 విలువైన జీవిత పాఠాలు ఇవి..!


తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమ, విలువలు,  రక్షణ ఇస్తారు.  ప్రతి పిల్లవాడికి మొదటి గురువు తల్లి అని అంటారు. అయితే ఇంటి బయట పిల్లలకు భాద్యతగా విద్య బుద్దులు నేర్పి,  జీవితాన్ని మలుపు తిప్పేది మాత్రం ఉపాధ్యాయులే. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎందరో గొప్ప వ్యక్తులు, ఎన్నో వృత్తులలో నిపుణులుగా గుర్తించబడుతున్నారంటే అదంతా ఉపాధ్యాయుల బోధన ద్వారానే బీజం పడుతుంది. ఉపాధ్యాయులు పుస్తకాల జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంలో జీవించడం,  వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అమూల్యమైన సూత్రాలను కూడా పిల్లలకు బోధిస్తారు. ప్రతి పిల్లవాడి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. పాఠశాల,  ఉపాధ్యాయులు వారికి నిజమైన జీవితానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాయి.   తల్లిదండ్రులు నేర్పలేని,  ఉపాధ్యాయులు బోధించగలిగే 5 జీవిత పాఠాలు ఉన్నాయి.  వాటి గురించి తెలుసుకుంటే..

క్రమశిక్షణ  ప్రాముఖ్యత..

ఇంట్లో పిల్లలు గారాబం  కారణంగా తరచుగా డిసిప్లిన్ తప్పుతారు.  ఇంట్లో పిల్లలు చాలా వరకు వారికి నచ్చినట్టు ఉంటారు. అయితే బడిలో ఉపాధ్యాయులే పిల్లలకు క్రమశిక్షణకు గల  నిజమైన అర్థాన్ని బోధిస్తారు. సమయానికి రావడం, హోంవర్క్ పూర్తి చేయడం, అల్లరిని కంట్రోల్ లో ఉంచడం,  చదువులో స్థిరంగా ఉండటం..  ఈ అలవాట్లు జీవితకాల విజయానికి పునాదిగా నిలుస్తాయి.

జట్టుకృషి,  సహకారం..

పాఠశాలలో క్రీడలు, సమూహ ప్రాజెక్టులు,  సాంస్కృతిక కార్యకలాపాలు పిల్లలకు టీం వర్క్   శక్తిని తెలుపుతాయి. ఒంటరిగా కాకుండా కలిసి పనిచేయడం  గొప్ప విజయాలకు దారితీస్తుందని ఉపాధ్యాయుల బోధనలో నేర్చుకుంటారు.

వైఫల్యాన్ని అంగీకరించడం..

పిల్లల తప్పులను ఇంట్లో కప్పిపుచ్చుతారు.  కానీ ఉపాధ్యాయులు వారికి వైఫల్యం నుండి పాఠం  నేర్చుకుని మళ్ళీ గెలవడానికి ధృఢంగా ఉండటం  నేర్పుతారు. ఈ గుణం తరువాత జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి వారికి సహాయపడుతుంది.

న్యాయం, సమానత్వం..

ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని సమానంగా చూస్తారు. కులం, మతం, లింగం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని వారు పిల్లలకు బోధిస్తారు. సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో ఈ విలువలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు..

ఉపాధ్యాయులు పిల్లలను తరగతి గదిలో ప్రశ్నలు అడగడానికి, ప్రసంగాలు ఇవ్వడానికి,  వేదికపై ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ప్రోత్సహిస్తారు. ఇది వారి ఆత్మవిశ్వాసం,  కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి దోహదం చేస్తుంది.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu