అమ్మకానికి ఆనందయ్య మందు.. దుకాణం తెరిచిన వైసీపీ నేతలు! 

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణిపై గందరగోళం కొనసాగుతోంది. ఆనందయ్య మందు కోసం వేలాదిగా జనాలు కృష్ణపట్నం వస్తూనే ఉన్నారు. గ్రామ సరిహద్దులో చెక్ పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు.. బయటి వారెవరు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పరిశోధనలకు సంబంధించిన నివేదికలు వచ్చాకే మందు పంపిణిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు  ఆనందయ్యను నిర్భందించిన అధికార పార్టీ నేతలు.. ఆయనతో  రహస్యంగా మందు తయారు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడంఅందరిని షాకింగ్ కు గురి చేసింది. ఒంగోలులో సమావేశానికి వచ్చిన మాగుంట... అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు అధికారులకు ఆనందయ్య మందు ఇవ్వడం వీడియోలో రికార్డైంది. దీంతో వైసీపీ నేతలపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు బలం చేకూరింది. 

అనందయ్య మందు, వైసీపీ నేతలతో సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. ఆయుర్వేద వైద్యంతో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆనందయ్యను ఏపీ ప్రభుత్వం వేధిస్తోందని  మండిపడ్డారు. ఆనందయ్య మందుపై వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. అవినీతి వేదంలో నిష్ణాతులైన వైసీపీ నేతలకు ఆయుర్వేదం గురించి ఏం తెలుసని నిలదీశారు. ఆనందయ్య మందు విషయంలో వైసీపీ నేతలు ఎందుకు కలగజేసుకుంటున్నారని ప్రశ్నించారు.

ఆనందయ్య మందును వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ప్రజల కోసం నిస్వార్థంగా మందును అందిస్తున్న ఆనందయ్యను నిర్బంధంలో ఉంచడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెల్లవారుజామున ఆయనను అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో ఉంచాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఆనందయ్య మందుకు గుర్తింపు వస్తే... అది మన రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల తర్వాత పోలీసుల నిర్భంధం నుంచి ఇంటికి వచ్చిన ఆనందయ్య.. మళ్లీ కనిపించకుండా పోయారు. తెల్లవారుజామున ఆనందయ్యను ఇంటి నుంచి పోలీసులు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆనందయ్య కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఆనందయ్య ఆచూకి చెప్పాలని, తమకు అప్పగించాలంటూ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆనందయ్యకు భద్రత కల్పించడం కోసమే తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu