టీడీపీ మహానాడు నుంచి ఎమ్మెల్యే వాకౌట్
posted on May 22, 2018 11:27AM

మహానాడు అనగానే టీడీపీ పార్టీ పండుగలా చేసుకునే కార్యక్రమమే గుర్తుకువస్తుంది. అందులో ఎమ్మెల్యేలే హీరోలుగా కనిపిస్తారు. కానీ ఖమ్మంలో జరిగిన ఓ మినీమహానాడు నుంచి సాక్షాత్తు ఎమ్మెల్యేను వాకౌట్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ వివరం ఏమిటంటే... ఖమ్మం జిల్లాకు సంబంధంచిన నగర కమిటీని మూడేళ్లుగా ఎటూ తేల్చడం లేదు. దాంతో ఖమ్మం తమ్ముళ్లు మాంచి ఆగ్రహం మీద ఉన్నారు. అదే సమయంలో ఖమ్మంలో జరుగుతున్న మినీమహానాడులో పాల్గొనేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మానికి చేరుకున్నారు. దాంతో కార్యకర్తలంతా ఆయన్ని ఘొరావ్ చేసినంత పని చేశారు. చివరికి కార్యకర్తలు తనని ఎగతాళి చేస్తుండటంతో... సండ్ర అక్కడి నుంచి కోపంగా వాకౌట్ చేయాల్సి వచ్చింది.