పోలవరం, నల్లమల సాగర్ పై పిటిషన్.. తెలంగాణకు సుప్రీం షాక్

తెలంగాణ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణార్హత లేదని విస్పష్టంగా పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు.   పోలవరం ప్రాజెక్టును నల్లమల్ల సాగర్‌తో లింక్ చేయడం వల్ల తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉల్లంఘన అవుతున్నాయని ఆయన వాదించారు.

అయితే సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ, పోలవరం, నల్లమల ప్రాజెక్టు విషయంలో కర్నాటక, మహారాష్ట్రలు కూడా ముడిపడి ఉన్నాయనీ, అందుకే ఈ వ్యవహారాన్ని మీడియేషన్ లేదా సివిల్ సూట్ ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది. పిటిషన్ డిస్మిస్ చేయాలా? ఉపసంహరించుకుంటారా అని సుప్రీం కోర్టు పేర్కొనడంతో  తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ ను ఉపసంహరించుకుంది.  , దీనిపై సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలపింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu