దివ్యాంగులకు జైపాల్‌రెడ్డి స్పూర్తి : సీఎం రేవంత్
posted on Jan 12, 2026 2:20PM
.webp)
దివ్యాంగులకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైకల్యం ఉందని ఆయన మనసులో కూడా రాలేదని తెలిపారు. ప్రజా భవన్ లో 'బాల భరోసా' పథకం, “ప్రణామ్” డే కేర్ సెంటర్ల ప్రారంభించి..దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ. 50 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు.
విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి ప్రత్యేక కోటా కేటాయిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని సీఎం ఆంక్షించారు.
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని చేస్తామని సీఎం వెల్లడించారు. తెలంగాణ కులగణన మోడల్‌ను దేశం అనుసరిస్తోందని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్ లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుంద... తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.