సూపర్ జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు : పీవీఎన్ మాధవ్
posted on Oct 6, 2025 7:45PM

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కర్నూలు లో తెలిపారు. బీజేవైయం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కర్నూలుకి చెందిన సునీల్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు మాదవ్, మాజీ ఎంపీ టీజీ. వెంకటేష్,ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మాదవ్ మాట్లాడుతూ యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో అన్ని రంగాల్లో ముందుకు పోతుందన్నారు. ఈనెల16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రజలు ఘనస్వాగతం పలకాలని కోరారు. సుపర్ జీఎస్టీ పై కర్నూలు లో ప్రధాని బహిరంగ సభలో పాల్గొననున్నారు.