సుధామూర్తి గారి సలహా.. పిల్లల్ని ఇలా పెంచితే డాక్టర్లు, ఐఏఎస్ లు కావడం ఖాయమట!

ఇంజనీర్, సామాజిక కార్యకర్త,  రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి,  సామాజిక సమస్యలపై  మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు.  భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి,  మహిళల అభ్యున్నతిలో ఆమె చాలా దోహదపడింది. ఆమె  జీవితమంతా ఒక ప్రేరణ కంటే తక్కువ కాదు. ఆమె జీవితంలో వివిధ సందర్భాలలో పేర్కొన్న ఎన్నో స్పూర్తిదాయక విషయాలు పిల్లలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. మీ పిల్లలు ఆత్మవిశ్వాసం,  ధైర్యం కోల్పోకూడదని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే, సుధా మూర్తి చెప్పిన స్పూర్తిదాయకమైన విషయాలను తప్పక పిల్లలకు చెప్పాలి. ఇవి చెబితే ఏ పిల్లవాడు అయినా ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంటాడు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఐఏఎస్, డాక్టర్ లాంటివి కూడా వారికి చిన్న లక్ష్యాలుగా అనిపిస్తాయి.

 కలలను ఎప్పటికీ వదులుకోవద్దు..

జీవితంలో  కలలను ఎప్పటికీ వదులుకోకూడదని సుధా మూర్తి అన్నారు. మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా పూర్తి చేయాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలలు నెరవేరుతాయి. పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటే వారు చిన్న వైఫల్యాలకు భయపడటం మానేస్తారు.

ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి..

జీవితంలో నేర్చుకోవడం ఏ సందర్భంలోనూ  ఆపకూడదని సుధా మూర్తి అన్నారు. ప్రపంచంలోకి ఎప్పుడూ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి.  సాంకేతికతతో ఎంత చురుగ్గా, ఎంత అవగాహనతో  ఉంటే, జీవితంలో  ముందుకు వెళ్లడం అంత సులభం అవుతుంది. నేర్చుకోవడం మెదడు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది.


అపజయానికి భయపడవద్దు..

సుధా మూర్తి చెప్పిన మాటల ప్రకారం  అపజయానికి భయపడకూడదు.  వైఫల్యాల నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. విజయానికి మార్గంలో వైఫల్యం తప్పనిసరి. పిల్లలు వారి వైఫల్యం నుండి నేర్చుకుంటే వారు జీవితంలో ముందుకు సాగకుండా ఎవరూ ఆపలేరు.

ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి..


 ఎవరి జీవితం  గురించి వారు ఆలోచించడం  సరికాదు.  సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి ఇతరుల భావాలను, వారి  అవసరాలను గౌరవించడం ముఖ్యం. తనకే పరిమితమైన మనిషి ఎప్పటికీ ముందుకు వెళ్లలేడు. పిల్లలు చిన్నతనం నుండే ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవాలి.


పిల్లలు ఈ మూడు విషయాలను అర్థం చేసుకున్నా, పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పినా.. ఆ పిల్లలు జీవితంలో తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు.

                                            *నిశ్శబ్ద.