ENGLISH | TELUGU  

ఈ వారం అసలైన వేసవి వినోదం.. థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలు!

on Apr 29, 2024

ఈ సమ్మర్ సీజన్ లో టాప్ స్టార్ల సినిమాల సందడి లేదు. ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే విడుదలవుతున్నాయి. ఈవారం ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మే 3న 'ఆ ఒక్కటీ అడక్కు', 'ప్రసన్న వదనం', 'శబరి', 'జితేందర్ రెడ్డి', 'బాక్' సినిమాలు విడుదల కానున్నాయి.

ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku):
ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్.. మళ్ళీ తన మార్క్ వినోదాన్ని పంచడానికి 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంతో వస్తున్నాడు. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఫరియా అద్బుల్లా హీరోయిన్. ఒకప్పుడు కామెడీ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న నరేష్.. మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

ప్రసన్న వదనం (Prasanna Vadanam):
విభిన్న సినిమాలతో అలరిస్తూ హీరోగా తనదైన ముద్ర వేస్తున్న సుహాస్.. ఇప్పుడు 'ప్రసన్న వదనం' అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడే యువకుడి పాత్రలో సుహాస్ కనిపించనున్నాడు. ఈ థ్రిల్లర్ సినిమాకి అర్జున్ దర్శకుడు.

శబరి (Sabari):
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా శబరి. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందినట్లు చిత్ర బృందం తెలిపింది.

జితేందర్ రెడ్డి (Jithender Reddy):
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ విరించి వర్మ రూపొందించిన పొలిటికల్ మూవీ 'జితేందర్ రెడ్డి'. 1980 లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

బాక్ (Baak):
సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ 'అరణ్మనై' నుంచి వస్తున్న నాలుగో చిత్రమిది. సుందర్. సి ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.


ఈ వారం ఓటీటీలోనూ పలు సినిమాలు సందడి చేయనున్నాయి.

నెట్ ఫ్లిక్స్:
డియర్ మూవీ (తమిళ్/తెలుగు) - ఏప్రిల్ 28 
హీరామండి సిరీస్ - మే 1
షైతాన్ మూవీ (హిందీ) - మే 3

హాట్ స్టార్:
ది వీల్‌ వెబ్‌సిరీస్‌ - ఏప్రిల్‌ 30 
మంజుమ్మల్ బాయ్స్ మూవీ - మే 5 

అమెజాన్ ప్రైమ్:
ది ఐడియా ఆఫ్‌ యూ మూవీ (హాలీవుడ్‌) - మే 2

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.