రాజన్ పై మరోసారి విరుచుకుపడ్డ స్వామి... టైం బాంబు ఫిక్స్ చేశారు

 

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ రఘురామ రాజన్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆయనను ఆర్బీఐ గవర్నర్ పదవి నుండి తొలగించాలని గతంలో ఆరోపించారు. ఇప్పుడు మరోసారి రాజన్ పై ఆయన మండిపడ్డారు. 2013లోనే ఆర్బీఐ గవర్నర్ భారత ఆర్థిక వ్యవస్థలో టైంబాంబును పెట్టారని 2016 డిసెంబర్ లో పేలేలా టైమ్ ఫిక్స్ చేశారని విమర్శించారు. మార్చుకోవలసిన 240 అమెరికన్ డాలర్లను బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్య స్వామి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి దీనిపై రాజన్ ఎలా స్పిందిస్తారో చూడాలి.

 

అయితే ఈసారి కూడా ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ నే ప్రధాని ఎన్నిక చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి ఎన్ని ఆరోపణలు చేసినా ప్రధాని మాత్రం సరిగ్గా స్పందిచని తీరు చూస్తుంటే.. అందునా నెటిజన్లు కూడా రాజన్నే మళ్లీ గవర్నర్ గా నియమించాలని కోరుతుండటంతో ఆయన్నే గవర్నర్ గా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.