పహల్గామ్‌ భద్రత వైఫల్యానికి బాధ్యత ఎవరిది? : ప్రియాంక గాంధీ

 

ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్బంగా లోక్ సభలో  ప్రధాన మోదీపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సైటైర్ల వేశారు. ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్‌ ఎవరైనా రాజీనామా చేశారా? పహల్గాం ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా? టీఆర్‌ఎఫ్‌ కొత్త సంస్థ ఏం కాదు. అది వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు?’’అని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. దానిపై ప్రధాని క్రెడిట్ తీసుకున్నారు. ఒలిపింక్స్‌లో ఎవరైనా పతకం సాధిసై దానికి కూడా ఆయనే క్రెడిట్ తీసుకుంటారు. తీసుకోండి.. బాధలేదు. కానీ బాధ్యత కూడా తీసుకోవాలి కదా? పహల్గామ్‌లో భద్రత వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు అని ప్రియాంక  ప్రశ్నించారు.  

బైసార‌న్ వ్యాలీలో ఎందుకు భ‌ద్ర‌తను ఏర్పాటు చేయలేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. స‌రైన భ‌ద్ర‌త లేక‌పోవ‌డం వ‌ల్లే అక్క‌డ ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ట్లు ఆమె ఆరోపించారు. దాని వ‌ల్లే 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. 2019లో టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఏర్ప‌డింద‌ని, ఆర్మీ అధికారుల్ని చంపుతూ 25 సార్లు ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డింద‌ని, కానీ 2023లో ఆ సంస్థ‌ను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించార‌న్నారు. బైసార‌న్‌లో జ‌రిగిన భ‌ద్ర‌తా లోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ‌రైనా త‌మ ప‌దువుల‌కు రాజీనామా చేశారా అని ప్రియాంకా  అడిగారు.నెహ్రూ గురించి భారతీయ జనతా పార్టీ నేత‌లు ప్ర‌స్తావించ‌డంతో.. ఆమె మాట్లాడుతూ మీరు గ‌తం గురించి చెబుతున్నార‌ని, కానీ తాను మాత్రం ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి మాట్లాడుతున్న‌ట్లు పేర్కొన్నారు. 

11 ఏళ్లు అధికారంలో ఉన్నార‌ని, దానికి బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. ముంబైలో 2008లో జ‌రిగిన సెప్టెంబ‌ర్ 26 దాడుల త‌ర్వాత ఆ రాష్ట్ర సీఎం, హోంశాఖ మంత్రి రాజీనామా చేసిన‌ట్లు ఆమె గుర్తు చేశారు. పెహల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయ‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.పాకిస్థాన్ సరెండ‌ర్ అయ్యేందుకు అంగీక‌రిస్తే, మ‌రి యుద్ధాన్ని ఎందుకు ఆపేశార‌ని ప్రియాంకా అడిగారు. అమెరికా అధ్య‌క్షుడు ఎందుకు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఉగ్ర‌వాద బాధితల బాధ‌ను అర్థం చేసుకుంటాన‌ని, త‌న‌కు వారి బాధ ఏంటో తెలుసు అని, త‌న తండ్రిని ఉగ్ర‌వాదులు చంపిన‌ప్పుడు త‌న త‌ల్లి ఎలా బాధ‌ప‌డిందో తెలుసు అని ప్రియాంకా అన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu