రేవంత్‌రెడ్డికి భారీ ఉరట... పిటిషన్‌దారుపై సుప్రీం మండిపాటు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. భూవివాదం కేసులో ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ  తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిన విషయం తెలిసిందే.  అయితే హైకోర్టు ఆదేశాలను సమాల్ చేస్తూ   పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాలు వేశారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటి షన్ దాఖలు చేశారు. 

ఆ పిటిషన్‌లో హైకోర్టు తీర్పునకు సంబంధింన అంశాలతో పాటూ తీర్పు వెలువరించిన న్యాయమూర్తిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఎన్  పెద్దిరాజు   పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది.  అలాగే ఎన్ పెద్దిరాజుతో పాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ బీఆర్ గవాయి  తదుపరి విచారణకు పిటిషనర్  పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.

అయితే ఈ అంశంపై పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్.. కోర్టు సాక్షిగా క్షమాపణ కోరారు. కేసు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.  కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ సీజేఐ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీస్‌కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే.. కోర్టు పరిగణలోకి తీసుకుం టుందని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చేనెల  11 కు వాయిదా వేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu