ఏపీ సీఎం చంద్రబాబుపై సింగ‌పూర్ మంత్రి ప్ర‌శంస‌ల వర్షం

సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు.. అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌ల నుంచే కాకుండా ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది.  సింగపూర్  నైపుణ్యాలు ఏపీకి అవసరం అంటూ చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు, ప్రభుత్వాన్ని కోరుతుంటే.. అందుకు ప్రతికా వారి నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

చంద్రబాబుతో ఐదు నిమిషాల భేటీ చాలు ఏపీలో పెట్టుబడులపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి అని ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్లు అంటుంటూ.. చంద్రబాబు పని తీరు అద్భుతం, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి అంటూ సింగపూర్ మంత్రులు పొగడ్తలు కురిపిస్తున్నారు.  తాజాగా సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్  చంద్రబాబు పని చేసే తీరు.. ప్రగతి పట్ల ఉన్న దార్శనికత అద్భుతమంటూ ప్రశంసించారు.   
 సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో  భాగంగా చంద్ర‌బాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని, గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్‌గా ఏపీ రూపాంతరం చెందుతోంద‌ని.. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నిసూచించారు.

దీనిపై సానుకూలంగా స్పందించి టాన్ సీలాంగ్,   నిరంత‌రం.. ప్ర‌జ‌ల కోసం ప‌ని పని చేస్తుండటం మీకెలా సాధ్యమౌతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   ప్ర‌జ‌ల‌తో మమేకం కావడం నుంచి వారి సమస్యల పరిష్కారం వరకూ చంద్రబాబు తీసుకుంటున్నశ్రద్ధ అనితర సాధ్యమని ప్రశంసించారు.  టాన్ సీలాంగ్ తో భేటీ సందర్భంగా గృహనిర్మాణం, సముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబుతో కలిసి పని చేయడానికీ తాము ఉత్సుకతతో ఉన్నామని టాన్ లాసింగ్ ఈ సందర్భంగా చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన ప్రాజెక్టులు ఇప్ప‌టికీ అంతే నాణ్య‌త‌తో కొన‌సాగుతుండటానికి కారణం చంద్రబాబు విజనే అని అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu