స్టూడెంట్ మౌనిక ఆత్మహత్య కేసులో కోచ్ అరెస్టు

 

స్టూడెంట్ మౌనిక ఆత్మహత్య కేసులో వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోచ్ అంబాజీ నాయక్ వేధింపులు భరించలేక మౌనిక ఆత్మహత్య చేసు కుంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కోచ్ అంబాజీ నిజామాబాద్ లోని తన ఊరికి పారిపోయాడు. అనంతరం తిరుపతికి వెళ్ళాడు. తిరుప తిలోని అడ్వకేట్ ను కలిసి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించాడు. తర్వాత తిరుపతి నుండి తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుండగా అదే సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారంతో పోలీసులు నిందితుడిని  రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ చేశారు. 

విద్యార్థిని మౌనిక మృతి చెందగానే కోచ్ అంబాజీ తన మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ కార్డును కూడా చేంజ్ చేశాడు. అంబాజీ నాయక్ పాత ఫోన్లో మౌనికను వేధింపు లకు సంబంధించిన డేటా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డేటా పోలీసులకు దొరకకూడదని అంబాజీ సిమ్ కార్డు ఛేంజ్ చేశాడు. పోలీసులు సిమ్ కార్డు స్వాధీనం చేసుకుని డేటా సేకరించే పనిల్లో పడ్డారు. 

సికింద్రాబాద్, లాలా గూడ పరిధిలో నివాసం ఉంటున్న మౌనిక తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో బిబిఏ సెకండియర్ చదువుతుంది. అయితే అదే కాలేజీలో పని చేస్తున్న వాలీబాల్ కోచ్ అంబాజీ పెట్టిన వేధింపులు భరించ లేక ఆమె ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే.. కోచ్ వేధిం పుల వల్లే తన కూతురు సూసైడ్ చేసుకుందని మౌనిక తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించి.. ఈరోజు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu