22న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్   పీవీ సింధు పెళ్లి

స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్  వెంకట  దత్త  సాయితో పివీ సింధు పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పివీ రమణ తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఈ నెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో అతికొద్ది మంది అతిథుల  సమక్షంలో  పెళ్లి జరగనుంది. జనవరి నుంచి పివి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.