చెలరేగిన బుమ్రా..ఇంగ్లండ్ ఆలౌట్
posted on Jul 11, 2025 7:24PM

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య మూడో టెస్టులో టీమిండియా పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు 251/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇంగ్లాండ్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి మరో 102 పరుగులను ఇంగ్లాండ్ జోడించింది.
ఆ మూడు వికెట్లనూ బుమ్రానే తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఒకదశలో 271కే ఏడు వికెట్లు పడినా.. బ్రాండన్ కార్సే(56), వికెట్ కీపర్ జేమీ స్మిత్(51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారీ స్కోర్ అందించారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన కార్సే.. సిరాజ్ సంధించిన స్లో బాల్‌కు బౌల్డ్ కావడంతో 387 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది.