అల్లు అస్సలూహించలేదు కదూ!?

 

నంద్యాల శిల్పం సైకిలెక్కనుందా? అన్న టాక్ వినిపిస్తోంది. కారణం.. ఆయన ఓడిపోయినప్పటి నుంచీ వైసీపీ అంటేనే చిన్న చూపు ఏర్పడిందట. అంతే కాదు.. ఎప్పుడో ఎక్కడో ఒక సారి పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్. దానికి తోడు ఆయన చూపు టీడీపీ వైపు మళ్లు తున్నట్టుగానూ భావిస్తున్నారట ఇక్కడ ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఇక్కడ అసలు మేటరేంటంటే.. ఈయనగారి ఈమాత్రం రాజకీయానికి అనవసరంగా వేలు పెట్టి లేని పోని గొడవకు కారణమయ్యాం కదాని తెగ ఫీలవుతున్నారట పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్. 

పుష్పరాజ్ గా ఫేమస్ అయిన దానికంటే.. నంద్యాల రవి కోసం ప్రచారానికి వెళ్లినపుడే ఎక్కువగా ట్రోల్ అయ్యారాయన. అంతేనా కుటుంబంలో లేని పోని గొడవలు. నానా యాగీ జరిగింది. నాగబాబు ట్వీట్ నుంచి మొదలు పెడితే.. మెగాహీరోల్లో సాయి ధరమ్ వంటి కొందరు హీరోలు అల్లువారబ్బాయిని అన్ ఫాలో చేయడం వంటి పరిణామక్రమాలు. ఆపై అల్లు అర్జున్ ఈ మొత్తం ఎపిసోడ్ పై వివరణ ఇచ్చుకోవల్సి రావడం.. ఇలా నానా రకాల రభస జరిగింది. ఏదో తన రెడ్డింటి భార్యామణి బంధువు కదాని.. వెళ్లినందుకు ఇంత హైరానా హంగామా జరిగాయి. ఇప్పుడవన్నీ బూడిదలో పోసిన పన్నీరా? అన్న క్వశ్చిన్ మార్క్ అల్లు అర్జున్ని తెగ డిస్ట్రబ్ చేస్తోందట. 

తాను సపోర్టుగా వెళ్లిన రవి చూస్తే కూటమి పార్టీలకే పెద్ద దిక్కయిన టీడీపీలోకి వెళ్లడమంటే ఇన్నాళ్ల పాటు తాను అనుభవించిన కష్టానికే అతి పెద్ద అవమానకరంగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఒక పక్క చూస్తే కుటుంబంలో కలహాలు. మరొక పక్క చూస్తే రాజకీయ కక్ష సాధింపుల్లాంటి ఘటనలు. ఎటు నుంచి ఎటు చూసినా.. నంద్యాల ఎపిసోడ్ నుంచి అల్లు అర్జున్ పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా రెండు వేల కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినా, తనకు నేషనల్- స్టేట్ అవార్డులు రెండొచ్చినా.. రవీ తీసిన ఈ ఎదురు దెబ్బ ముందు అవన్నీ తేలిపోయినట్టుగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఇది తాను అస్సలు ఊహించలేదట. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. 

ఇంత పెద్ద సెలబ్రిటీ వెళ్లి కూడా అక్కడ రవి ఓడిపోయారు. ఇప్పుడు చూస్తే ఆయన పార్టీయే మారనున్నారు. అంటే, ఒకటికి రెండు దెబ్బలు. రవి కోసం నంద్యాలకు వెళ్లడంతో తనను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకుని చూసుకున్నాయి. ఈగ కూడా వాలనివ్వలేదు. మొన్నటికి మొన్న పవన్ అడవులను దోచేవాడు హీరో ఏంటన్న కామెంట్ల సమయంలో కూడా అల్లు అర్జున్నే వెనకేసుకొచ్చారు వీరంతా. దీనంతటికీ కారణమైన రవి ఒక వేళ టీడీపీలోకి వెళ్లిపోతే.. తాను కూడా ఆ పార్టీలోకి వెళ్లినట్టా? లేక ఫ్యాన్ పార్టీలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే కంటిన్యూ అవుతుందా? తేలాల్సి ఉందంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ.