మహిళలపై  హింస నిర్మూలన దిశగా వోగ్స్ కార్యక్రమాలు  

మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని విజయవాడ ఒబెస్ట్రికల్, గైనకాలజీ సొసైటీ(వోగ్స్ )  నిర్ణయించింది.  నవంబర్ 25 నాడు  మహిళలపై  జరుగుతున్నహింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఐరాస పిలుపు మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నవంబర్ 25 మహిళల హింస నిర్మూలనాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.  1981లో, కొలంబియాలోని బొగోటాలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.   నవంబర్ 25  నుంచి  ఈ నెల 16 వ తేదీ వరకు తమ సంస్థ  అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు వోగ్స్అధ్యక్షురాలు శ్రీదేవీ వెల్లంకి సెక్రటరీ సుజాత  వెల్లంకి తెలిపారు.    ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదినిముషాలకు  ఓ మహిళ హత్యకు గురవుతుందన్నారు.2024 నినాదం ‘ నో ఎక్స్ క్యూజ్  మహిళల మీద హింస అరికట్టడానికి అందరం ఏకమవుదాం’. అయితే ఈ రోజు మహిళల ఆరోగ్యంపై అనేక సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీ  ముఖ్యంగా  గైనకాలజీ సమస్యలు వెంటాడుతున్నాయని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. 60  విద్యాసంస్థల్లో 12 500 మంది విద్యార్థులకు 400 మంది ఉపాధ్యాయులకు అవగాహనా కార్యక్రమాలను వోగ్స్ నిర్వహిస్తోంది.  రేడియోలో చర్చాగోష్టి, స్టేజిషోలు, రోల్ ప్లేలు, నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని వోగ్స్ పేర్కొంది.