కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ సీఐ సస్పెండ్

 

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలానగర్ ఎక్సైజ్ సీఐ వేణు కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. DTF నర్సిరెడ్డి, ఏఈఏఎస్ మాధవయ్య సహా మిగతా వారి పాత్రపై దర్యాప్తు చేస్తోంది. తనిఖీలు చేయకుండా కల్తీ కల్లు తయారవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుపై వేటు వేసింది.

కల్తీ కల్లు ఘటనపై ఐదు టీంలో ఎంక్వైరీ చేయించిన ఎక్సైజ్ శాఖ   ఇప్పటికే  హైదర్‌నగర్, హెచ్ఎంటీ హిల్స్, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది . నలుగురు వ్యాపారులు  రవితేజ గౌడ్ (29), కోన సాయి తేజ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్ గౌడ్ (39)లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు.  కల్తీ కల్లు తాగి 8 మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.